urban culture
-
స్పీడ్ బ్రీడింగ్ పద్ధతుల్లో.. అర్బన్ అన్నదాత!
విస్తారమైన పొలాల్లో ఆరుబటయ సాగేది సంప్రదాయ వ్యవసాయం అయితే.. నియంత్రిత వాతావరణంలో అత్యాధునిక సాంకేతికతలతో చేసేదే అర్బన్ వ్యవసాయం. మట్టిలో కాకుండాపోషకాలతో కూడిన నీటిలో వర్టికల్ స్ట్రక్చర్లలో లేదా కొబ్బరి పొట్టుతో కూడిన గ్రోబాగ్స్‌లో అర్బన్ సాగు జరుగుతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాగు వ్యవస్థలతోపాటు ప్రత్యేకంగా బ్రీడింగ్ చేసిన వంగడాలు కూడా అవసరమే అంటోంది ‘అర్బన్ కిసాన్’. మానవాళి రేపటి ఆహారపు, పర్యావరణ అవసరాలు తీర్చటం కోసం స్పీడ్ బ్రీడింగ్ తదితర పద్ధతుల్లో పరిశోధనలు చేపట్టి చక్కని పురోగతి సాధిస్తోంది. ఈ హైదరాబాద్ సంస్థ విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సహా పలు సంస్థల భాగస్వామ్యంతో అర్బన్ సాగు ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. పట్టణీకరణ తామరతంపరగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతికతలతో కూడిన అర్బన్ ఫార్మింగ్ పద్ధతులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనివే హైడ్రోపోనిక్స్, సాయిల్ లెస్ ఫార్మింగ్, వర్టికల్ ఫార్మింగ్, ఇండోర్ ఫార్మింగ్ వంటివి. ఈ సాగు వ్యవస్థలను ముఖ్యంగా అర్బన్ రైతులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ సమీపంలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది ‘అర్బన్ కిసాన్’. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తూ అర్బన్ కిసాన్ అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ పండించిన లెట్యూస్, ఇటాలియన్ బసిల్ తదితర ఆకుకూరలు, రంగురంగుల కాప్సికం తదితర కూరగాయలతో తయారైన సలాడ్స్‌ను ఫార్మ్బౌల్ పేరుతో హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తోంది.అర్బన్ సాగు కోసం ప్రత్యేక వంగడాలు..హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిపారిశ్రామికవాడలో అర్బన్ కిసాన్ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. విహారి కానుకొల్లు, డాక్టర్ సాయిరాం రెడ్డిపాలిచర్ల కొందరు మిత్రులతోపాటు అర్బన్ కిసాన్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. విహారి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, డా. సాయిరాం రెడ్డి, డా. నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి. హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ వ్యవస్థలను శీతల గదిలో,పాలీహౌస్లో, మేడపైన.. ఇలా అనేక వాతావరణ పరిస్థితుల్లో మట్టి లేకుండా వివిధ పంటలు పండించటంపై వారు లోతైన పరిశోధనలు చేస్తున్నారు.హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి పారిశ్రామికవాడలోని అర్బన్ కిసాన్ పరిశోధన కేంద్రంలో హైడ్రోపోనిక్స్ సాగు దృశ్యాలుపొలాల్లో వాడే సాధారణ వంగడాలను నియంత్రిత వాతావరణంలో, పరిమిత స్థలంలో సాగు చేయటం అనేక ఇబ్బందులతో కూడిన పని. అందుకే అర్బన్ సాగుకు అవసరమైన ప్రత్యేక వంగడాల రూపుకల్పన కృషికి అర్బన్ కిసాన్ శ్రీకారం చుట్టింది. మన దేశపు 150 రకాల కూరగాయలు, ఆకుకూరలపై ప్రయోగాలు చేశారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో పండటంతోపాటు.. వేర్ల పొడవు, మొక్క సైజు, ఆకారం తదితర అంశాల్లో అర్బన్ ఫార్మింగ్‌కు అనువుగా చిన్న సైజులో ఉండేలా అనేక సరికొత్త వంగడాలను రూపొందించామని డా. సాయిరాం రెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఇవి తిరిగివాడుకోదగిన సూటి రకాలేనని, వీటిని నియంత్రిత వాతావరణంలో ఏ దేశంలోనైనా పండించవచ్చన్నారు.చెప్పినంత దిగుబడి..!హైడ్రోపోనిక్స్ సాగు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే, ఎవరి దగ్గరా కంప్లీట్ టెక్నాలజీ లేదు. మా దగ్గర తప్ప. మేం వాడుతున్నది స్వయంగా మేం దేశీయంగా పరిశోధనల ద్వారా రూపొందించుకున్న పరిపూర్ణమైన, సమగ్ర సాంకేతికత ఇది. అందుబాటులో ఉన్న టెక్నాలజీలతోపోల్చితే 60% ఖర్చుతోనే మా టెక్నాలజీని అర్బన్ ఫార్మర్స్ పొందవచ్చు. దీని ద్వారా చెప్పినంత దిగుబడి కచ్చితంగా ఇస్తుంది. ప్రపంచంలో ఎవరైనా టెక్నాలజీ అమ్ముతారు లేదా ్రపొడక్టు అమ్ముతారు. మేం అలాకాదు. ఇతర సంస్థలతో కలిసి భాగస్వామ్యంలో యూనిట్లు నెలకొల్పి ఉత్పత్తి చేసి విక్రయించి లాభాలు పంచుకుంటాం. ఈ పద్ధతిలోనే అనేక దేశాల్లో యూనిట్లు ఏర్పాటు చేశాం. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే హైడ్రోపోనిక్ కూరగాయలు, ఆకుకూరలను ప్రీమియం ప్రైస్‌తో అమ్మగలగాలి. మానవాళి భవిష్యత్తు ఆహారపు అవసరాలు తీర్చగలిగిన శక్తిసామర్థ్యాలున్న టెక్నాలజీ ఇది.– డాక్టర్ సాయిరాం రెడ్డి, పాలిచర్ల, అర్బన్ కిసాన్ పరిశోధనా కేంద్రం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా sai@urbankisaan.com2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలు..బెండ, టొమాటో, పచ్చిమిర్చి వంగ తదితర కూరగాయల్లో ఒక్కో రకానికి సంబంధించి 2–3 రకాల వంగడాలను రూపొందించారు. ఫంగస్ సోకని బేసిల్ (ఇటాలియన్ తులసి)ను రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ, కాండం తెల్లగా ఆకు గ్రీన్‌గా ఉండే రకరకాల తోటకూర రకాలను రూపొందించారు.పాలకూర, కొత్తిమీర, గోంగూరలో కూడా కొత్త వంగడాలను రూపొందించారు. కీరదోస, సొర, కాకర వంటి తీగజాతులు పొలినేషన్ అవసరం లేకుండా దిగుబడినిచ్చే విధంగా రూపొందిస్తున్నాం అన్నారు డా. సాయిరాం. సాధారణంగా ఒక కొత్త వంగడాన్ని బ్రీడింగ్ చేయాలంటే 6–7 ఏళ్లు పడుతుంది. స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో తాము 2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలను రూపొందించగలిగామన్నారు.95 శాతం నీటి ఆదా..!వేగవంతమైన నగరీకరణ నేపథ్యంలో నగరాల్లో ఏడాది పొడవునా అర్బన్ప్రాంతీయులకు తాజా ఆకుకూరలు, కూరగాయలు అందించడానికి ద్రవరూప ఎరువులతో చేసే వర్టికల్ ఫార్మింగ్ ఉపయోగపడుతోంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలు పండించటం వల్ల కలిగే ప్రయోజనాలను భారత్‌తోపాటు ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. సాధారణ వ్యవసాయంలో వాడే నీటితోపోల్చితే ఈ పద్ధతిలో 95% ఆదా అవుతుంది. పొలంలో పంటతోపోల్చితే నిర్దిష్టమైన స్థలంలో 30 రెట్లు అధిక దిగుబడి సాధించడానికి హైడ్రోపోనిక్స్ ఉపయోగపడుతుందని, అందులోనూ ఈ సాంకేతికతను దేశీయంగానే అభివృద్ధి చేశామని అర్బన్ కిసాన్ చెబుతోంది. సాగులో ఉన్న పంటల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగాపోషకాల మోతాదు, పిహెచ్ స్థాయిలు, వాతావరణంలో తేమ, కార్బన్డయాక్సయిడ్ స్థాయి, కాంతి తీవ్రత వంటి అనేక ఇతర అంశాలన్నిటినీ ఒక యాప్ ద్వారా నియంత్రిస్తుండటం విశేషం. వర్టికల్ ఫార్మింగ్ వ్యవస్థల్లో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగిస్తూ ఫార్మింగ్ ఆటోమేషన్‌లో అర్బన్ కిసాన్ తనదైన ప్రత్యేకతను చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోపోనిక్స్ సాగు జరుగుతున్నా ఇందులో అన్ని దశలకు సంబంధించిన సంపూర్ణ సాంకేతికత ఒకే చోట అందుబాటులో లేదు. అర్బన్ కిసాన్ పూర్తిగా సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం విశేషం.మధ్యప్రాచ్య దేశాల్లో ఆదరణ..అర్బన్ కిసాన్ ఇండోర్ హైడ్రోపోనిక్స్ యూనిట్లలో పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, సెన్సార్ల ఆధారంగానే ఫామ్ యాజమాన్యం ఉంటుంది. దుబాయ్, ఒమన్, ఖతార్ దేశాల్లో మూడేళ్ల క్రితం 50% భాగస్వామ్యంతో హైడ్రోపోనిక్స్ యూనిట్‌ను నెలకొల్పాం. అదే మాదిరిగా బహామాస్ దేశంలోనూ 50% భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన యూనిట్‌ను కూడా తాము ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నామని డా. సాయిరాం రెడ్డి వివరించారు. అక్కడ ఆకుకూరల ధర కిలో 12 డాలర్లు. మా యూనిట్లలో కిలో 5 డాలర్లకే ఆకుకూరలను ఉత్పత్తి చేస్తున్నాం. అమెరికా, కెనడా, నార్వే దేశాల్లో కూడా జాయింగ్ వెంచర్లు ఏర్పాటు చేయబోతున్నాం.మన దేశంలో హైడ్రోపోనిక్స్ యూనిట్లకు పారిశ్రామిక విద్యుత్తు చార్జీలు వర్తిస్తుండటం ఈ హైటెక్ సాగు విస్తరణకు ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికైతే ఇది కాస్త ఖరీదైన ప్రత్యామ్నాయ ఆహారోత్పత్తి పద్ధతే. కానీ,పోషక విలువలున్న, పురుగుమందుల్లేని ఆహారాన్ని అందించే ఈ పద్ధతి ఏదో ఒక రోజున మెయిన్ స్ట్రీమ్‌లోకి వస్తుందని అర్బన్ కిసాన్ ఆశాభావంతో ముందడుగు వేస్తోంది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవి చదవండి: కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..! -
అర్బన్ రొయ్యల చెరువు!
వాడేసిన కార్గో కంటెయినర్లలో లెట్యూస్ వంటి ఆకు కూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్స్ లేదా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో, మట్టి వాడకుండా కేవలం పోషక జలంతో సాగు చేసే అర్బన్ ఫార్మర్స్ చాలా దేశాల్లో ఉన్నారు. అయితే, నగరాల్లో ఆకాశ హర్మ్యాల మధ్య ఐరన్ కంటెయినర్లలో మంచినీటి రొయ్యల సాగు చేయటం.. అందులోనూ పర్యావరణానికి హాని కలిగించని కాలుష్య రహిత సుస్థిర అర్బన్ ఆక్వా సాగు పద్ధతులను అనుసరించడం సుసాధ్యమేనని రుజువు చేస్తోంది ‘అతర్రాయ’ అనే సంస్థ. కొద్దిపాటి శిక్షణతోనే కాలుష్య రహిత పద్ధతిలో కంటెయినర్ రొయ్యల సాగును సులువుగా నేర్పిస్తోంది ఈ సంస్థ. కంటెయినర్లో బయోఫ్లాక్ పద్ధతిలో రొయ్యల సాగు చేసే ‘ష్రింప్ బాక్స్’ సాంకేతికతపై పేటెంట్ పొందిన ఈ సంస్థ మెక్సికో కేంద్రంగా పనిచేస్తోంది. సాధారణ పద్ధతుల్లో సాగే రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్, రసాయనాలు, గ్రోత్ హోర్మోన్స్ వాడుతున్నారు. వ్యర్థ జలాలతో సముద్రం కలుషితమవుతోంది. ‘మేం ఈ సమస్యలేవీ లేకుండా ఎథికల్ ఆక్వాకల్చర్ పద్ధతిలో ఎక్కడ కావాలంటే అక్కడే కంటెయినర్లో సులభంగా రొయ్యలు సాగు చేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో తొలిగా అందుబాటులోకి తెచ్చామ’ని అతర్రాయ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డేనియల్ రసెక్ అంటున్నారు. రసెక్ మెక్సికోలో కాలేజీ విద్యను పూర్తి చేసుకొని 2005లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేశారు. ఆక్వాకల్చర్‌ను సుస్థిర సేద్య పద్ధతులపై పనిచేయడానికి ఓ స్టార్టప్ సంస్థను స్థాపించారు. ‘మెక్సికో ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో విస్తారమైన చెరువుల్లో సాగు పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు అతి తక్కువ చోటులో తక్కువ కాలుష్యం కలిగించే సుస్థిర సాగు పద్ధతులపై అధ్యయనం చేపట్టాం. 2019లో ఇతర వనరుల నుంచి ఆర్థిక సహాయం అందిన తర్వాత సాఫ్ట్వేర్, ఆటోమేషన్ ఉపకరణాలను కూడా సమకూర్చుకొని పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగించని ఆరోగ్యదాయకమైన రీతిలో రొయ్యల సాగు చేపట్టే సమగ్ర అత్యాధునిక సాంకేతికతకు తుదిమెరుగులు దిద్దాం’ అని రసెల్ చెబుతున్నారు. కంటెయినర్ రొయ్యల సాగులో మూడు సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. బయోఫ్లాక్.. రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. అందువల్ల యాంటీబయోటిక్స్ లేదా హానికరమైన రసాయనాల అవసరమే రాదు. ఈ ష్రింప్ బాక్స్‌లో అన్ని పనులనూ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రించుకునే అవకాశం ఉంది. నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, రొయ్యల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గణాంకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి మేతను ఎక్కడి నుంచైనా అందించే సాంకేతికతను జోడించటం విశేషం. డేటాను బట్టి వర్క్‌ఫ్లో మాపింగ్ చేశారు. కాబట్టి, కంటెయినర్లో రొయ్యల సాగులో ఎవరికైనా అతి సులభంగా శిక్షణ ఇవ్వటం సాధ్యమవుతోంది. ఎలా పండించారో తెలియని, ఎప్పుడో పట్టుకుని నిల్వ చేసిన రొయ్యలను నగరవాసులు తినాల్సిన అవసరం లేదు. తమ ‘ష్రింప్ బాక్స్’ను నగరం నడిబొడ్డునైనా ఏర్పాటు చేసుకొని రొయ్యలను పెంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఆరోగ్యదాయకమైన రొయ్యలను ఆరగించవచ్చు అంటున్నారు రసెక్. కంటెయినర్లో 1.5 టన్నుల రొయ్యలు అత్యాధునిక రొయ్యల చెరువుగా మేము రూపుదిద్దిన కార్గో కంటెయినర్ విస్తీర్ణం 50 చదరపు మీటర్లు. దీనిలో ఏటా 1.5 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నాం. సాధారణ చెరువుల్లో ఇన్ని రొయ్యలు పెంచాలంటే కనీసం రెండు హెక్టార్ల భూమి కావాలి. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే రొయ్యలను పెంచడానికి ‘ష్రింప్ బాక్స్’ ఉపయోగపడుతోంది. 70% పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ‘ష్రింప్ బాక్స్’లో రొయ్యలు పెంచడానికి డాక్టరేట్ ఏమీ అక్కర్లేదు. 2–4 వారాల శిక్షణతో ఎవరైనా రొయ్యల రైతుగా మారొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యాపార విస్తరణే మా లక్ష్యం. – డేనియెల్ రసెక్, ‘ష్రింప్ బాక్స్’ ఆవిష్కర్త, మెక్సికో – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
స్కై లాంతర్ ఫెస్ట్
స్కై లాంతర్ఫెస్ట్... అర్బన్ కల్చర్‌లో ఓ భాగం. అయితే ఈసారి ఈఫెస్ట్ను ‘రైజ్‌అప్’ రూరల్ కాజ్‌కోసం నిర్వహిస్తోంది. రోజంతా కష్టపడ్డా పూట గడవని బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పూనుకొంది. ఈరోజు, రేపు జరిగే ఈ ఫెస్టివల్‌కి గచిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని గోల్ఫ్‌క్లబ్ వేదికైంది. ఈ స్కైలాంతర్ ఫెస్ట్‌లో పాల్గొనాలనుకునేవారికి రిజిస్ట్రేషన్ ఫీ 250 రూపాయలు పెట్టామని.. లాంతర్ కూడా కావాలంటే 450 రూపాయలు చెల్లించాలని రైజ్‌అప్ టీమ్ సభ్యుడు సాయినాథ్ తెలిపారు. వచ్చిన మొత్తాన్ని బీడీ కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు. మంచి కాజ్‌కోసం జరుగుతున్న ఈఫెస్ట్‌లో సిటీవాసులు ఎక్కువగా పాల్గొనాలని ఆశిద్దాం! -
సామాన్య అసామాన్యులు!
కళ పట్టణ సంస్కృతి, వీధి జీవితం అనేవి ముంబాయికి చెందిన సమీర్ కులవూర్ కుంచెలో కొత్త కాంతులతో కనిపిస్తాయి. నిత్యజీవితంలోని ఎన్నో సామాన్య దృశ్యాలను తన కళ్లలో దాచుకొని, ఆ తరువాత వాటికి కుంచెతో కళాకాంతులు చేరుస్తాడు. ‘ఘోడా సైకిల్’ పేరుతో ఆయన చేసిన ప్రాజెక్ట్‌లో సామాన్యులు ఎంత అసామాన్యంగా కనిపిస్తారో చెప్పలేం! సామాన్యులు తమ దైనందిన పనులకు సైకిల్‌ను ఎన్ని రకాలుగా, ఎన్ని సృజనాత్మక మార్గాల్లో ఉపయోగిస్తారో చక్కగా గీసి చూపించారు సమీర్. ‘‘పనిగట్టుకొని పట్టణ సంస్కృతిని, వీధి సంస్కృతిని ప్రేమించడం లేదు. అది సహజంగానే నాలో భాగం అయింది’’ అని చెబుతున్న సమీర్‌కు ముంబాయిలో ‘డాక్ డిజైన్స్’ పేరుతో ఒక స్టూడియో ఉంది. చిత్రకారులు, కళాభిమానుల రాకపోకలతో అదెప్పుడూ సందడిగా ఉంటుంది. ‘బ్లూడ్’ పుస్తకం సమీర్‌కు అవార్డ్లనే కాదు ఎంతో గుర్తింపును తీసుకువచ్చింది. ఆ పుస్తకంలో కనిపించేవి బొమ్మలు మాత్రమే కాదు దైనందిన సమస్యలను పరిష్కరించుకొనే సృజనాత్మక మార్గాలు కూడా! సామాన్యులు తమ రోజువారీ పనులకు సైకిల్‌ను ఎన్ని రకాలుగా, ఎన్ని సృజనాత్మక మార్గాల్లో ఉపయోగిస్తారో చక్కగా గీసి చూపించారు సమీర్. -
మంచి ఇంకా మిగిలే ఉంది!
మానవ సంబంధాలకు విలువ తగ్గిందని, పట్టణ సంస్కృతి పెరిగాక ఎవరి జీవితం వారిది అన్నట్టుగా తయారైందని, కష్టంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఓదార్చే చెయ్యి కూడా కరువవుతోందని కొందరు ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ అందరూ అలానే లేరు. కొందరిలో మంచితనం ఇంకా మిగిలేవుంది. అందుకు ఉదాహరణే ఇది. అమెరికాలోని మిసోరీలో నివసించే శాండ్రా అనే మహిళకు, స్థానిక రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటు అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అక్కడికి వెళ్లేది. ముఖ్యంగా తన పెళ్లి రోజును అక్కడే చేసుకునేది. ఒకటీ రెండుసార్లు కాదు... 31 ఏళ్లపాటు ఆ రెస్టారెంటులోనే చేసుకుంది. కానీ ఈ సంవత్సరం అందుకు అవకాశం లేదు. ఎందుకంటే... ఆమె భర్త హఠాన్మరణం చెందాడు. అది కూడా తమ 32వ పెళ్లి రోజు మరికొద్ది రోజులు ఉందనగా. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది శాండ్రా. వేదనలో మునిగిపోయి బయటకు వెళ్లడమే మానేసింది. ఆమెను సంతోషపెట్టేందుకు ఆమె పిల్లలు రకరకాల ప్రయత్నాలు చేశారు. కూతురైతే తల్లికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి పెట్టాలని రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ వెయిట్రస్‌తో తన తల్లి పడు తోన్న బాధ గురించి చెప్పింది. ఆ వెయిట్రస్ వెంటనే విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసింది. వారు ఆ వెయిట్రస్‌తో కలిసి శాండ్రాకు ఓ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘మీకు కలిగిన వేదనకు మేము ఎంతో చింతిస్తున్నాం. 31 సంవత్సరాల పాటు మీరు మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజును మా రెస్టారెంటులో గడిపారు. వచ్చే పెళ్లిరోజు నాడు కూడా మా దగ్గరకు వచ్చి, మా రెస్టారెంటులో భోజనం చేసి వెళ్లండి’. ఉత్తరం చదివి కన్నీటి పర్యంతమైన శాండ్రా, 32వ పెళ్లి రోజున రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె ఎప్పుడూ తన భర్తతో కలసి కూర్చునే టేబుల్‌నే కేటాయించారు. మంచి విందును ఉచితంగా ఇచ్చారు. అంతేకాదు... ప్రతి ఏటా ఆ రోజున వచ్చి తాము ఇచ్చే విందును ఆరగించమని కూడా కోరారు. అందుకే అనేది... మంచితనం ఇంకా మిగిలే ఉందని!