ఐఓఈ
మారుతున్న జీవన పరిస్థితులతో పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. అన్నింటికీ ఆధారభూతమైన ఈ భూమండలం మనం సృష్టించే కాలుష్యం దెబ్బకు ఉక్కిరిబిక్కిరవుతోంది. పర్యావరణాన్ని రక్షించుకొంటే గానీ మనుగడకు ముప్పు తప్పదనే సందేశంతో ప్రదర్శించే నాటకం ‘ఐఓఈ: ది ఇన్‌హెరిటర్స్ ఆఫ్ ది ఎర్త్’. మలయాళం రచయిత వైకోమ్ మహమ్మద్ బషీర్ రాసిన పొట్టి కథ ‘భూమియూడె అవకాషికల్’ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు.
క్యారెక్టర్లతో పాటు పపెట్స్, మాస్క్స్, మల్టీమీడియా వంటివి కూడా ఈ ప్లేలో భాగం పంచుకుంటాయి. ఇందులో ఉపయోగించే మెటీరియల్స్ అన్నీ ఓ రీసెర్చ్ వర్క్‌షాప్‌లో ఈ థియేటర్ గ్రూప్ మెంబర్స్ సొంతంగా తయారు చేసినవే. ఓ గ్రామ, నగర బాహ్య, అంతర జీవన గమన తీరును చూపే ప్రయత్నం ఇది. యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకాన్ని ధరిత్రీ దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన థియేటర్ హట్... ‘బీ 4.48 థియేటర్’ గ్రూప్ ప్రదర్శిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల సమాహారం థియేటర్ హట్. ఎన్నో రకాల కల్చరల్, థియేటర్ వర్క్‌షాప్స్ నిర్వహించింది.
వేదిక: లామకాన్, బంజారాహిల్స్
సమయం: గురువారం రాత్రి 8 గంటలకు, ఎంట్రీ పాస్‌ల కోసం
ఫోన్: 9676145161