పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. చికాకులు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పనులు సకాలంలో పూర్తి కాగలవు. నిరుద్యోగులు, విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. వారం ప్రారంభంలో ధనవ్యయం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీరతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో దూరప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికరంగం వారు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. వారం మధ్యలో ధన,వస్తులాభాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. ఒక వివాదం నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయరంగం వారికి పదవులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
బంధువుల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఇంటిలో శుభకార్యాలు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. చర్చలు సఫలీకృతమవుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూవివాదాల నుంచి విముక్తి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో బంధువులతో వివాదాలు. అనారోగ్యం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
రావలసిన సొమ్ము అందుతుంది. మిత్రులు, బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. కళారంగాల వారికి పురస్కారాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ప్రయాణాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వివాదాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహరించి వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. చికాకులు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు పైస్థాయి నుంచి అజమాయిషీ పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సమయానికి డబ్బు అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. వారం మధ్యలో ప్రయాణాలు.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు