కండెబలం | Corn | Sakshi
Sakshi News home page

కండెబలం

Published Sat, Jun 10 2017 11:57 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

కండెబలం - Sakshi

కండెబలం

రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్‌ తిందువా....? కారముప్పు, మసాలాలు... దట్టించ మందువా? (ట్యూన్‌ మార్చుకోండ్రి) హే ‘రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్‌ తిందువా

‘రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్‌ తిందువా....? కారముప్పు, మసాలాలు... దట్టించ మందువా? (ట్యూన్‌ మార్చుకోండ్రి) హే ‘రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్‌ తిందువా? తిందువా? (కోరస్‌)కారముప్పు మసాలాలు దట్టించ మందువా? మందువా? (కోరస్‌) నిప్పుల్లో దోరగా వేయించరా..? వేయించరా..? (కోరస్‌)పేలాలు వేపడమే నెక్స్‌ట్‌ రా! నెక్స్‌ట్‌ రా! (కోరస్‌)

ఏంది సంగతి.. పేరడీ ఊపుమీద ఉంది అంటారా? జూన్‌ 11న ప్రపంచ మొక్కజొన్న కండెల డే కదా. అందుకే హడావడి. ఏంటీ... మొక్కజొన్న డేనా? ఓరి నాయనో.. ఈ ఫారినర్స్‌కి ఏం పనిలేదా? క్యాట్‌ డే, ర్యాట్‌ డే అంటే... వాటిని ముస్తాబు చేసి ముద్దు చేస్తారు ఓకే, మరి మొక్కజొన్న కండెల రోజుకేం చేస్తారు? అనేగా మీ డౌట్‌! ఏం చెయ్యారు! మంచిగా రకరకాల రెసిపీల్లో కండెను ఊడికించి, వేయించి, నిప్పుల మీద కాల్చి లొట్టలేసుకుంటా లాగించేస్తారు! (రెండు మొక్క.. మొక్క...) పాడింది చాలుగానీ విషయం చెప్పమంటారా? సరే అయితే మేటర్‌లోకి వెళ్లిపోదాం పదండి!

సిటీ కార్న్‌
పచ్చని పల్లెల్లో.. ప్రకృతి లోగిల్లో... చినుకు పడేవేళల్లో... నిప్పుల మధ్య దోరగా వేయించిన మొక్కజొన్న కండెను కొరుక్కు తినడంలో ఉన్న మజానే వేరు.  ఇక సిటీ వాసులైతే ఉప్పు, కారం, కొత్తిమీర, మసాలా.. దట్టించి ఇచ్చే స్వీట్‌ కార్న్‌కే ఓటేస్తున్నారు. అందుకే సిటీల్లో స్వీట్‌ కార్న్‌ బండ్లు పోటెత్తుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి సుమారుగా 80 కోట్ల టన్నుల పైమాటే. వీటిని 15 కోట్ల హెక్టార్లుల్లో సుమారు 4970 కిలోగ్రాములు దిగుబడి జరగుతోందని అంచనా. మొక్కజొన్న పంటల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. చైనా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, భారత్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి.

మొక్కజొన్న ఆరోగ్యకరం
మొక్కజొన్న తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు వైద్య నిపుణులు. ఇందులోని విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు గుండెజబ్బులు రాకుండా కాపాడతాయి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించడంలో, బరువు తగ్గడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో.. తోడ్పడతాయి. ఎముకలు ధృడం చేయడంతో పాటు, పేగు సంబంధిత క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. చర్మసౌందర్యాన్ని, కంటిచూపును మెరుగుపరుస్తాయి చరిత్ర చాలా పెద్దది ఇంచుమించు 5000 సంవత్సరాల క్రితమే దక్షిణ అమెరికాలోని మెక్సికోలో మొక్కజొన్నను పండించేవారు. 1492లో వ్యాపారం పేరుతో ఐరోపావాసులు, స్పానిష్‌ వలసదారులు ఈ మొక్కజొన్నను ప్రపంచానికి పరిచయం చేశారు.

కండెలాంటి కట్టడాలు
అద్భుతాలను నిర్మించే ఆర్కిటక్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఆకారంతో కూడా కట్టడాలను నిర్మించారు. జొన్న ఆకారంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌లు, బిల్డింగ్లు, పెవిలియన్లు కట్టేశారు. వాటిలో చెప్పుకోదగ్గది మెక్సికోలోని జొన్నకండెకి చుట్టు ఉండే (ఊక) ఆకులు ఆకారంలో నిర్మించిన పెవిలియన్‌. దీన్ని 2015లో లాగౌర్‌ డిజైన్స్‌ అనే ఓ నిర్మాణ సంస్థ నిర్మించింది.

∙సమ్‌థింగ్‌ స్పెషల్‌
సాంకేతిక పరిజ్ఞానంలో చైనా  ఎప్పటికప్పుడు ముందుటుంది. అయిదు సంవత్సరాల క్రితం ‘చైనీస్‌ రైల్వే కార్పొరేషన్‌’ రైల్వే ట్రాకు అవసరం లేని సరికొత్త  ట్రైన్‌లను డిజైన్‌ చేసింది. ప్రత్యేకమైన మార్గాలలో రబ్బర్‌ చక్రాలతో పరుగులు తీసే  ఈ ట్రాక్‌లెస్‌ రైళ్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై చైనీస్‌ రైల్వే కార్పొరేషన్‌కు  సర్వహక్కులు ఉన్నాయి. సంప్రదాయ రైళ్లతో పోల్చితే  ఈ ట్రాక్‌లెస్‌ ట్రైన్‌లకు తక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కాలుష్యరహితం కూడా. ఇప్పటికైతే ఈ ట్రైన్‌లో మూడు వందల మందికి పైగా ప్రయాణించవచ్చు.

– సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement