మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటాబయటా మీదే పైచేయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. విద్యార్థులు అనుకున్న కోర్సులలో ప్రవేశిస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణఒత్తిడులు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. ఇంటిలో శుభకార్యాలు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సంఘంలో గౌరవం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఒక ఆహ్వానం అందుతుంది. వివాదాలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. ప్రయాణాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. పనులు సజావుగా సాగుతాయి. ఇంటిలో శుభకార్యాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అందుతాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
కొన్ని పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఇంటి నిర్మాణయత్నాలలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటాబయటా బాధ్యతలు. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. పరపతి పెరుగుతుంది. వాహనయోగం. భూవివాదాలు తీరతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వారం చివరిలో పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
-సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయం పెరిగినా ఖర్చులు సైతం అదేస్థాయిలో ఉంటాయి. తరచూ ప్రయాణాలు సంభవం. మిత్రులతో వివాదాలు నెలకొనే అవకాశం. నిర్ణయాలలో నిదానం అవసరం. కొత్త బాధ్యతలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. కళాకారులకు మరింత అనుకూలం.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
ఐశ్వర్యారాయ్
పుట్టినరోజు: నవంబర్ 1
చారిత్రత్మక కట్టడం
చంద్రబింబం: అక్టోబర్ 27 నుండి నవంబర్ 02 వరకు
Published Sun, Oct 27 2013 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement