కథ: ది జయసుధ | Funday story of the week | Sakshi
Sakshi News home page

కథ: ది జయసుధ

Published Sun, Feb 16 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

కథ: ది జయసుధ

కథ: ది జయసుధ

‘‘మరి వాడిమీద నీకెందుకంత కరుణ. మీ వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో, ర్యాగింగ్ ఇన్‌ఛార్జి ఫ్యాకల్టీకో కంప్లెయింటివ్వొచ్చుగా?’’ సూటిగా అడిగాను. ‘‘వద్దు బావా! వాడూ మాలాంటి స్టూడెంటేగా. వాడికి జైలుశిక్ష వేసి పాస్‌పోర్ట్ లాగేసుకుంటారట గదా, పాపం!’’ ‘‘అవును పాపం! థాయిల్యాండ్ వెళ్లి మసాజ్ చేయించుకోలేడు కదా! నీదెంత జాలి గుండో!’’ మళ్లీ జోక్.
 
 ‘మై కాల్ పురుష్ హూ. మామూలోడ్ని గొప్పోడిగా మార్చగలిగే శక్తి నా స్వంతం హై. అట్లాగే గర్వంతో విర్రవీగే పోతుని మేక లెక్క మే మే అన్పించే నాటకం భీ మేరా హీ కామ్ హై... ఇస్వంటి వన్నింటికీ నేనే సాక్షిని హై!’
 నా రివాల్వర్ తుడుచుకుంటూండగా నా కొలీగ్ షరీఫ్ ఎదురుగా ప్రత్యక్షమై ఓ వరమిస్తున్న దేవుడిలా ఫోజెట్టి, ‘‘దావణగిరిలో దాదాగిరి ఆఫరుంది, వెళ్దామా?’’ అనడిగాడు. విషయమేంటన్నట్టు కళ్లతోటే అడిగాను. ‘‘బాగా బలిసిన సేటు, కూతురు ఎవడితోనో లవ్ ఎఫైరంట, వార్నింగ్ ఇస్తే చాలంట, పర్టిక్యులర్‌గా నువ్వే కావాలంట. నన్నప్రోచ్ అయ్యాడు. ఎప్పుడు చేద్దాం?’’
 నా ఛాతీ గర్వంతో ఉబ్బింది. ‘‘చూద్దాంలే, ఓ వారం లోపు’’ కొంచెం కటింగ్ ఇచ్చా. వాడిక్కాలింది. ‘‘ఆ రివాల్వర్ తుడిచాక మడిచి జేబులో పెట్టుకోరా, వాడకు పాడైపోద్ది’’ అంటూ నా కేబిన్ నుంచి సైడైపోయాడు. పిచ్చి వెధవ, నేను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టయినందుకే గదా, నాకీ క్రేజు! కరుణాకర్‌రెడ్డి, ద డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అఫ్పోలీస్ అంటే... పడాల్సిందే!
    
 వార్నింగ్ ఇవ్వడంలో నా పద్ధతే వేరు. రివాల్వర్ నోటికి కుంకుమ అద్ది, ముష్కరుడి నుదుటికి ఆనించి ట్రిగ్గర్ మీద వేలెట్టి నొక్కినట్టు చిన్న జెర్క్ ఇస్తా. బొట్టుపెట్టి మరీ చెప్పినట్లు! మల్లాది వెంకట కృష్ణమూర్తి ఫేసు పాఠకుడికి తెలియనట్టు నేను కూడా నా ఫొటోను ఎక్కడా లీక్కానివ్వలేదు. నేను ఫలానా అని తెలిసినప్పుడు - అవతలోడి కళ్లలో ఆ భయం తాలూకు మెరుపు చూడ్డం నాకు చచ్చేంత ఇష్టం. అబ్బోవ్, భలేవుంటది లే.
 నా మొబైల్ కాల్ లాగ్‌లో మూడు మిస్‌డ్ కాల్స్ ఉన్నయి. ‘జయసుధ’ అని ట్రూ కాలర్ ఐడీ తెలియజేస్తోంది. కొంపదీసి సహజనటి నా అభిమాన తార జయసుధ కాదు గద!? ఛా, ఐనా ఆవిడ నాకెందుకు ఫోన్ చేసుద్ది? నిజంగా చేస్తే? ఒక్కసారి ఈ కరుణ గాడి మీద దయ కురిపించి ఓ ఫోట్వా దిగి... ఆ... దిగి?
 ఫోన్ రింగయ్యింది. ‘జయసుధ’. ‘‘బావా, నేను, జయసుధను. గుర్తుపట్టావా? పదేళ్ల క్రితం - బెంగళూరులో మా బాబాయి పెళ్లి... నువ్ రాసిన లవ్‌లెటర్ మోసుకెళ్లి...’’
 ‘‘వార్నీ నువ్వా! ప్లెజంట్ సర్‌ప్రైజ్! ఎలా ఉన్నావ్‌రా? నా నెంబరెవరిచ్చారు? చాలా పెద్ద దానివైపోయుంటావ్, ఏం చేస్తున్నావిప్పుడు? ఎక్కడున్నావ్?’’ ఆ అమ్మాయి నాకు వరుసకు మరదలు. ఆమె పేరదే.
 ‘‘నేనిక్కడే హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ ఫస్టియర్ జాయినయ్యాను బావా. ఇక్కడ హాస్టల్లో నాకు ర్యాగింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. నువ్వేమైనా సాల్వ్ చేస్తావేమోనని!?’’ అంటూ డీటైల్డ్‌గా అన్నీ చెప్పేసింది జయసుధ.
 గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో ధనిక వర్గం సంతానం ప్రిఫర్ చేసే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన జయసుధ హాస్టల్‌లో - తన రూమ్ అటాచ్డ్ బాత్‌రూమ్‌లో సీనియర్ కుర్రాడు ప్రత్యక్షమై - ర్యాగింగ్! అంట! ఈజిట్ ఏ ప్రాంక్? ఏ ప్రాక్టికల్ జోక్? అంత సెక్యూరిటీ ఉండే లేడీస్ హాస్టల్ రూమ్‌లో ఇదెట్లా సాధ్యం? ర్యాగింగ్ చట్టబద్ధమైన నేరం. వాడెవడో గనక దొరికితే జైలు శిక్షతో పాటు కెరీర్ కూడా నాశనం ఐపోతుంది - అందుకే కంప్లయింట్ ఇవ్వకుండా - పెద్ద మనసుతో నాకు మొరపెట్టుకుంటోంది నా చిట్టి మరదలు.
 వాళ్ల హాస్టల్ రూమ్‌కెళ్లాను. జయసుధ లేలేత సొగసులతో ముద్దొచ్చేసింది. ‘‘సిన్మాల్లో ట్రై చేస్కోక ఈ ఇంజనీరింగెందుకు?’’ అనడిగా, బుగ్గ గిల్లుతూ. ‘‘నీకెందుకు?’’ అంది గోముగా - బుగ్గ రుద్దుకుంటూ. పక్కనే ఉన్న ఇంకో అమ్మాయిని తన రూమ్‌మేట్‌గా పరిచయం చేసింది.
 ‘‘నీ పేరు జయప్రదా?’’ జోకేశా. ‘‘కాదు, కరుణశ్రీ’’ ‘‘ఓహ్!  నా పేరే! గుడ్. నా పేరున్న అమ్మాయినే రూమ్మేట్‌గా సెలెక్ట్ చేస్కున్నావ్. నా కరుణ నీ మీద ఎల్లప్పుడూ ప్రసరిస్తుంది’’ అన్నాను నాటకీయంగా. ‘‘ముందు పన్జూడు బావా. వాడు రోజూ నేను కాలేజీ నుండొచ్చేసరికే నా బాత్రూమ్‌లో దాక్కుని, భౌ భౌ చెప్పి జంపవుతున్నాడు. నా గుండాగిపోతోందంటే నమ్ము!’’ కళ్లింత పెద్దవి చేసుకుని ఆందోళనగా కరుణశ్రీ వైపు చూస్తూ అంది జయసుధ.
 ‘‘మరి వాడిమీద నీకెందుకంత కరుణ. మీ వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో, ర్యాగింగ్ ఇన్‌ఛార్జి ఫ్యాకల్టీకో కంప్లెయింటివ్వొచ్చుగా?’’ సూటిగా అడిగాను.
 ‘‘వద్దు బావా! వాడూ మాలాంటి స్టూడెంటేగా. వాడికి జైలుశిక్ష వేసి పాస్‌పోర్ట్ లాగేసుకుంటారట గదా, పాపం!’’
 ‘‘అవును పాపం! థాయిల్యాండ్ వెళ్లి మసాజ్ చేయించుకోలేడు కదా! నీదెంత జాలి గుండో!’’ మళ్లీ జోక్.
 ‘‘వూర్కో బావా. వాళ్ల పేరెంట్స్ ఎంత ఫీలవ్వాల్సి ఉంటుందో అనేదే నా కన్సర్న్. నీకు తెల్సుగదా. నేనెవర్నీ హర్ట్ చేయను, వీలైతే నా చాతనైనంత సహాయం చేసి...’’
 ‘‘ఓ - చాల్చాలు. నువ్వప్పట్లో సహాయం చేశావ్. బదులుగా ఇప్పుడు నన్నీ సహాయం చేయమంటున్నావ్. అంతేగా?’’ ఆమె నవ్వింది అవునన్నట్లు.
    
 ఐదింటికి గానీ జయసుధ రూముకు రాదు. నేను నాల్గింటికే వెళ్లి రూమ్ తాళం తీసి బాత్రూంలోకి నడిచి తలుపేసుకున్నా. బాత్రూం చాలా పరిశుభ్రంగా ఉంది. సబ్బు పరిమళం గదంతా వ్యాపించి ఆహ్లాదంగా ఉంది. బహుశా ఈ కాస్ట్‌లీ సబ్బు దొంగతనం చేయడానికే వాడు..? ఛ ఛ... అయ్యుండదులే. బైట ఏదో అలికిడయ్యింది. బహుశా వాడేనేమో? నేనలర్ట్ అయిపోయా. ఎవరో అమ్మాయిలు గట్టిగా అరుస్తూ నవ్వుతూ వెళ్తున్నారు. స్టూల్ మీద కూర్చుని నా రివాల్వర్ తీసి దాన్ని ప్రేమగా తడిమాను. విష్ణుచక్రం కన్నా పవర్‌ఫుల్. దాన్ని ముద్దుపెట్టుకున్నాను. ట్రిగ్గర్‌లో వేలుపెట్టి గిర్రున తిప్పాను. అద్దంలో చూస్తూ రకరకాల ఫోజులు పెట్టి చూసుకుని తృప్తిపడ్డాను. మహేశ్, ఎన్టీయార్, నాగ్... వీళ్లంతా గన్ను పట్టుకోవడం మాత్రమే తెల్సినోళ్లు. కానీ, గన్నెలా పేల్చాలో నాకు తెల్సు. నేను - నిజమైన హీరోని. యస్.
 టైము ఐదయ్యింది. ఎవడూ రాలేదు. జయసుధ, కరుణశ్రీ వచ్చేశారు. వాళ్లు ఆత్రంగా బాత్రూం తెరవగానే నేనే ‘భౌ భౌ’ అని అరిచేశా. వాళ్లు తెగ నవ్వేశారు. ఇంతలో రూమ్ డోరు దగ్గర ఒక ప్రౌఢ వనిత, మెడలో ఐడీ కార్డు. ‘‘జయసుధా, వాటీజ్ దిస్? ఇతనెవరు?’’ అనడిగింది అసహనంగా.
 ‘‘మేడమ్, ఇతను మా బావగారు, పోలీస్ ఇన్‌స్పెక్టర్’’ చెప్పింది జయసుధ, భయం భయంగా.
 ‘‘ఐతే? ఇక్కడేం పని? ఇట్లా లేడీస్ హాస్టల్ రూముల్లోకి వచ్చేయగూడదు. విజిటర్స్ రూమ్‌లో మాత్రమే...’’ అందావిడ.
 నేను కల్పించుకుని విషయం చెప్పబోతుండగా - జయసుధ తన పెద్ద కళ్లతో వద్దని సైగ చేసింది.
 నేను వెంటనే, ‘‘ఆ! ఏం లేదు మేడమ్, తెలంగాణ స్టేట్ ఏర్పాటు ఔతోంది కదా. జయసుధ మంచి ఆర్టిస్టు. మన తెలంగాణ రాష్ట్ర పోలీసు కోసం ఒక ఎంబ్లెమ్ డిజైన్ చేశానని చెప్తే, చూసెళదామని రూమ్ దాకా రావాల్సి వచ్చింది. అంతే మేడమ్!’’ అబద్ధమాడేశా.
 ‘‘ఓకే ఓకే, క్యారీ ఆన్’’ అంటూ ఆవిడ వెళ్లిపోగానే, ‘‘బావా, బహుశా నువ్వు ఉన్న విషయం కనిపెట్టి వాడు వచ్చుండడు! యస్. అంతే జరిగుంటది. ఓ రెండ్రోజులాగి మళ్లీ రా బావా’’ అంది జయసుధ ప్రార్థిస్తున్నట్లుగా.
 ‘‘ఓకే డన్. నేనొకసారి వప్పేసుకున్నానంటే దానంతు తేల్చేదాకా నిద్రపోను. రేపు గనక వాడొస్తే, మీ ఇద్దరూ కలిసి వాడి ఫొటో తీసి నాకు మెయిల్ పెట్టండి.’’
 ‘‘ఓకే బావా. ఇంక ఇక్కణ్నుంచి మెల్లిగా వెళ్లిపో. క్విక్!’’
    
 నా మెయిల్లో వాడి ఫొటో వచ్చింది. మరీ చీకట్లో తీసినట్టు ఉందా ఫొటో. నిన్న రాత్రి వీళ్లు మెస్‌కెళ్లి వచ్చేసరికి రూమ్‌లో బెడ్‌మీద పడుకుని ఉన్నాడట. కరుణశ్రీ ఎలర్టయ్యి తన సెల్‌ఫోన్లో వాడి ముఖం గబుక్కున ఫొటో తీసే లోపే వాడు జంపయ్యాడట. ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కచ్చితంగా ఆ హాస్టల్ వర్కర్స్, స్వీపర్స్ లేదా వాడి లేడీ క్లాస్‌మేట్స్ సహాయం చేస్తే తప్ప, ఇంత ధైర్యంగా చేయలేడు వాడు. అఫీషియల్‌గా ఐతే, వీళ్లందర్నీ తోలుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే విషయం తన్నుకుంటూ బైటికొచ్చేది. కానీ ఇది సీక్రెట్ ఆపరేషన్. కరుణారసభరితమైన కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వాల్సిన ఇన్‌స్ట్రక్షన్ ఉన్న ఇన్వెస్టిగేషన్ మిషన్. జయసుధ ముందు కాలరెగరేసే సమయం ఆసన్న్ హువాహై. అటు పిమ్మట మొత్తం ఎపిసోడ్‌ను మా ఆవిడకు సిన్మా చూపించెయ్యాలి. సాయంత్రం నుంచి రాత్రి భోజనం దాకా జయసుధ రూమ్‌లో పాగా వేయడానికి డిసైడైపోయాను.
    
 రాత్రి తొమ్మిదయ్యింది. బాత్రూమ్‌లో ఓ వారగా స్టూల్ మీద నేను వాడికోసం ఎదురుచూస్తున్నాను. డోర్ తెరుచుకుంది. ఎదురుగా ఒక అస్పష్టాకారం. దొరికాడు. చూడు ఇప్పుడెలా కోటింగిస్తానో వెధవకి. నా సెల్‌ఫోన్ టార్చి ఆన్ చేసి వాడి మొహం మీదకి వేశాను. జెర్కిన్ ధరించిన జీన్ ప్యాంట్ కింద పోలీస్ షూస్! అతని చేతిలో కూడా రివాల్వర్ ఉంది. నా వైపే గురిచూస్తోంది.
 
 ‘‘యూ ఆర్ అండర్ అరెస్ట్!’’ అంటూ బాత్రూమ్ లైట్ స్విచ్ వేశాడతను. డోర్ అవతల్నుంచి వార్డెన్ మేడమ్ ఐడీకార్డు తొంగి చూస్తోంది. జయసుధ, కరుణశ్రీల జాడలేదు. నా ముఖంలో నెత్తుటి చుక్క లేదు. నా పేరు చెప్పి ఐడీ కార్డు చూపించి మా బాస్‌తో చెప్పించాక గానీ నన్ను జీపు దింపలేదు వాళ్లు. జయసుధ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. సరాసరి ఇంటికెళ్లి, ‘‘జయసుధ ఏమైనా ఫోన్ చేసిందా? ఇటొచ్చిందా?’’ అనడిగాను మా ఆవిడని. ‘‘జయసుధా? మనింటికెందుకొస్తుంది?’’
 ‘‘మీ కజిన్ జయసుధ! ఇక్కడ ఇంజనీరింగ్ జాయినైందిగా. నీకు తెలీకపోవడం ఏంటి?’’అవాక్కైయ్యా. కానీ పళ్లు కొరికా.
 ‘‘ఆ అమ్మాయా? బెంగళూర్లో మెడిసిన్ చదువుతోంది. ఇక్కడ ఉండటమేంటి? ఏం మాట్లాడుతున్నారు? ఏం జరిగింది?’’
 ఇంక నేనేం మాట్లాడకుండా బాత్రూమ్‌కెళ్లిపోయాను. గర్వభంగం. ప్రాంక్. నామీదే ప్రాక్టికల్ జోకా? ఉండు దాని సంగతి చెప్తా. నన్నే ఏడిపిస్తావా - జయసుధా?! ఏం సహజ నటనా కౌశలం!
 నేను స్నానం చేసి బైటికి రాగానే ఫేస్‌బుక్‌లో జయసుధ ఫొటో చూపించింది నా భార్య. అమాయకపు ముఖం, పెద్ద పెద్ద కళ్లు! భోజనమయ్యాక మెల్లిగా పక్కమీదకు చేరి తలవత్తుకుంటుంటే, ‘‘జండూబామ్ రాయనా?’’ అంటూ నా పక్కన చేరింది, జయసుధ వాళ్ల కజిన్.
 ఆమె గుండెల్లో నా తల దాచుకుని దుఃఖించాలని అటు వైపు తిరిగా. అప్పటిదాకా బాగా కంట్రోల్ చేసుకున్నట్టుంది. పాపం - తనకి నవ్వు పొట్టలోంచి తన్నుకొస్తోంది... తెరలు తెరలుగా... అర్థమైంది.
 ‘‘నన్ను గెలుచుకోవడానికి మీరు జయసుధని వాడినట్లే, మిమ్మల్ని మలుచుకోవడానికి నేనూ తనని ప్రయోగించా. ఏ? తప్పా?’’ అంది పెదాల్ని సున్నా చుట్టి.  జెర్కిన్ ధరించిన జీన్ ప్యాంట్ కింద పోలీస్ షూస్! అతని చేతిలో కూడా రివాల్వర్ ఉంది. నా వైపే గురిచూస్తోంది.
 ‘‘యూ ఆర్
 అండర్ అరెస్ట్!’’ అంటూ బాత్రూమ్
 లైట్ స్విచ్ వేశాడతను. డోర్ అవతల్నుంచి వార్డెన్ మేడమ్
 ఐడీకార్డు
 తొంగి చూస్తోంది. జయసుధ, కరుణశ్రీల జాడలేదు.
 
 ‘‘ఎందుకు మలుచుకోవడం?’’
 ‘‘ఈ మధ్య మీకు బాగా తలబిరుసు ఎక్కువైంది. మీ ప్రొఫెషన్‌ను- సేవలా కాకుండా హీరోయిజంగా చూట్టం వల్లనే ఇదంతా. విలన్‌గా మారని వాడే అసలైన హీరో!’’
 సిటి స్కాన్ తియ్యకుండానే నాకెక్కడ కాలుతుందో ఈజీగా చెప్పేయొచ్చు. ఐనా నోర్మూసుకుని ఉండటం భోజనానంతరం విందు పొందుటకు ముఖ్యం కావున - క్షమాభిక్ష పెట్టేశాను.
 (ఈ మధ్య ఎవరో అడిగారు - సిన్మా చూస్తూ ఏడుపొచ్చిన సిన్మాలేమైనా చూశావా? అని. ద వన్ అండ్ ఓన్లీ జయసుధగారు మాత్రమే ఆ పని చేయించగలరని జవాబిచ్చాను. ఈ కృతి అందుకే ఆమెకు అంకితమిస్తున్నా.)
 - .డా॥జి.సురేశ్‌బాబు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement