కొత్త పుస్తకం | Fundaybook review of the week | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకం

Published Sun, Jun 15 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

కొత్త పుస్తకం

కొత్త పుస్తకం

నివేదన (విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ గీతం ‘కొరొ జాగొరితొ’కి పలువురు తెలుగు కవుల అనువాదాలు, అనుకరణలు) సంపాదకుడు: మోదుగుల రవికృష్ణపేజీలు: 140; వెల: 100 ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాద్‌తోపాటు, సంపాదకుడు, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూర్-522004. ఫోన్: 09440320580
 
 ఒక ఆనందకారణం... ఇది సమీక్ష, అభిప్రాయం కన్నా- ఒక చిన్న పరిశీలన. ముందుగా పుస్తకం గురించి. ఇరవయ్యో శతాబ్దపు ఆరంభంలో రవీంద్రనాథ్ టాగోర్  వంగభాషలో ‘చిత్తొ జెథా భొయ్‌షున్నొ, ఉచ్ఛొ జెథా శిర్/ గ్యాన్ జెథా ముక్తొ, జెథా గ్రిహేర్ ప్రాచీర్’ గీతం రాశాడు. ఆయనే స్వయంగా ‘గీతాంజలి’ ఆంగ్ల సంకలనంలోకి దాన్ని అనువదించుకున్నాడు. తద్వారా అది ప్రపంచవ్యాప్తంగా ఎందరికో చేరువైంది; ఎన్నో భాషల్లోకి అనువాదమైంది; అలా తెలుగులోకీ వచ్చింది. 1913లో ఆదిపూడి సోమనాథరావుతో మొదలుపెట్టి, 2014లో షేక్‌బాబ్జీ దాకా... కొంగర జగ్గయ్య, చలం, చినవీరభద్రుడు, తిరుమల రామచంద్ర, దాశరథి, బెజవాడ గోపాలరెడ్డి, మధు రొండా, మో, రాయప్రోలు; ఇలా ఎందరో ఆ గీతాన్ని అనువదించారు.
 
 అలాంటి అనువాద ప్రేరేపకమైన గీతానికి వచ్చిన 41 తెలుగు తర్జుమాలతో 2003లో బి.ఎస్.ఆర్.కృష్ణ ‘నివేదన’ సంకలనం తెచ్చారు. దానికి రెట్టింపు జోడింపులతో వచ్చిన మలిముద్రణ ఇది. ఆంగ్లపాఠం ‘వేర్ ద మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్’ కూడా కలుపుకొంటే పూర్తిగా వంద అనువాదాలు ఇందులో ఉన్నట్టు లెక్క! క్లుప్తంగా అనువాదకుల పరిచయాలు కూడా ఉన్నాయి.
 
 అయితే, వంగ గీతం అర్థం కాకపోయినా అందులో ఒక తూగువుంది; చక్కగా పాడుకోగలిగే అంత్యప్రాసల లయ ఉంది; అలాంటిది ఆంగ్లంలోకి కేవలం భావమే వచ్చింది; పైగా అది చేసుకున్నది స్వయంగా రవీంద్రుడే! అంటే, సాక్షాత్తూ గురుదేవుడే ‘ఫెయిల్’ అయ్యాడంటే, మిగిలిన అనువాదకులను తప్పు పట్టడానికి ఏముంది?
 
 అంటే, ఈ ఆహారం ఏమిటి? దేనికి మంచిది? ఎన్ని క్యాలరీలున్నాయి తరహా ఎన్‌సైక్లోపీడిక్ సర్వస్వం బట్వాడా అవుతుందేగానీ ‘రుచి’ బదిలీ కాదన్నమాట! ఇది సమస్త అనువాదాల సమస్య అనుకుంటాను. అయితే, ఈ విషయం టాగోర్‌కీ తెలుసు, అనువాదాలు చేసే పెద్దవాళ్లందరికీ తెలుసు.
 
 ఒక మూలభాషలో పలవరించింది, పూర్తిగా ఆ భాష పాఠకులకే చెందుతుంది. అంటే ప్రతి భాషా పాఠకులకూ - ఇంకా చెప్పాలంటే, ఆ భాష మాట్లాడేవాళ్లందరికీ కూడా- తాము మాత్రమే అనుభవించగలిగే ప్రత్యేక నిధి ఏదో ఉంటుందన్నమాట! భాషల అస్తిత్వాల స్పృహతో చూస్తే, ఇది కూడా ఆనందం కలిగించే విషయమే కదా!
 - రాజిరెడ్డి
 
 కొత్త పుస్తకాలు
 వాన కురిసిన రాత్రి (కవిత్వం)
 రచన: డా.బండి సత్యనారాయణ
 పేజీలు: 112; వెల: 60
 ప్రతులకు: కవి, ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం-530003. ఫోన్: 8331841965
 
 గుండెలవిసినచోట (కవిత్వం)
 రచన: సిరిసిల్లా గఫూర్‌శిక్షక్
 పేజీలు: 112; వెల: 95; ప్రతులకు: తెలంగాణ రచయితల వేదిక, కేరాఫ్ జూలూరు గౌరీశంకర్, 1-8-702/33/20ఎ, పద్మ కాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44. కవి ఫోన్: 9849062038
 
 నేస్తం (కవిత్వం)
 రచన: అవధాని కడిమిళ్ల రమేష్
 పేజీలు: 32; వెల: -
 ప్రతులకు: కడిమిళ్ల శ్రీవిరించి, 3-6-50, యర్రమిల్లివారి వీధి, నరసాపురం, ప.గో.-534275; ఫోన్: 9247879606
 
 యోగసిద్ధి
 రచన: డా. పిట్టా సత్యనారాయణ
 పేజీలు: 60; వెల: 80; ప్రతులకు: పి.విజయలక్ష్మి, 24-7-199/1/1, ఎన్‌ఐటి దగ్గర, హన్మకొండ-4. ఫోన్: 9849812054
 
 గర్జన (తెలంగాణ ముస్లింవాద కవిత్వం)
 రచన: మహమ్మద్ హనీఫ్ అలీ
 పేజీలు: 50; వెల: 40; ప్రతులకు: రచయిత, 5-9-68, మాన్యం చెల్క, గల్లీ, నల్గొండ. ఫోన్: 9346491023
 
 ఉషోదయం
 రచన: రామదాసు వీరభద్రరావు
 పేజీలు: 72; వెల: 50; ప్రతులకు: రచయిత, ఎల్‌ఐజి 17, ఎపిహెచ్‌బి కాలనీ, రామచంద్రాపురం.
 తూ.గో. ఫోన్: 9542787287
 
 హృదయాలాపన (కవిత్వం)
 రచన: చిత్రాడ కిషోర్‌కుమార్
 పేజీలు: 60; వెల: 60; ప్రతులకు: మల్లెతీగ, 41-20/3-24, మన్నవ వారి వీధి, కృష్ణలంక, విజయవాడ-13.
 ఫోన్: 9246415150
 
 స్త్రీచక్రం (నాటిక)
 రచన: పగడాల శ్యామ్‌సుందర్
 పేజీలు: 40; వెల: 25; ప్రతులకు: 9291346318

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement