‘‘విక్రమార్కా...ఒకడు జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లాడు. కాని ఆఫీసర్ అడిగిన ఫస్ట్ కొచ్చెన్ నుంచి లాస్ట్ కొచ్చెన్ వరకు ఏది అడిగినా కేవలం రెండక్షరాలతోనే మేనేజ్ చేశాడు. ఇది ఎలా సాధ్యం?’’ అడిగాడు భేతాళుడు. ‘‘ఎందుకు సాధ్యం కాదు భేతాళా! అదిగో అటు చూడు...’’ అని సీన్ చూపించాడు విక్రమార్కుడు.
అనగనగా ఒక కార్యాలయం. ఆ కార్యాలయంలో...
ఆఫీసర్: నీ పేరేమిటి?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: పూర్తి పేరు?
క్యాండిడేట్:మనోహర్ పీడ సార్.
ఆఫీసర్: మీ నాన్నగారి పేరు?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: పూర్తి పేరు?
క్యాండిడేట్: మంగయ్య పీడ సార్. చనిపోయారు.
ఆఫీసర్: ఎలా?
క్యాండిడేట్: ఎంపీ
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్:మందు ప్రాబ్లం సార్.
ఆఫీసర్: మీ నేటివ్ ప్లేస్?
క్యాండిడేట్:ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మధ్యప్రదేశ్ సార్
ఆఫీసర్: ఏం చదువుకున్నావు?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మెట్రిక్ పాస్ సార్.
ఆఫీసర్: ఈ జాబు ఎందుకు చేయాలనుకుంటున్నావు?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మనీ ప్రాబ్లం సార్.
ఆఫీసర్: నీ పర్సనాలిటీ గురించి చెప్పు...
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మైండ్ బ్లోయింగ్ –పర్సనాలిటీ సార్.
ఆఫీసర్: నీకు ఇష్టమైన కూర?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మునక్కాడ పప్పు సార్.
ఆఫీసర్: ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్:మెహదీపట్నం సార్.
ఆఫీసర్: నీకు ఇష్టమైన పుస్తకం?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మహాప్రస్థానం సార్.
ఆఫీసర్: నీకు ఇష్టమైన డ్రింక్?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మంచి పాలు సార్.
ఆఫీసర్: నీకు ఇష్టమైన సినిమా?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మెషిన్‌గన్ ప్రీచర్ (హాలివుడ్ సినిమా–2011, డైరెక్టర్: మార్క్ ఫోస్టర్)
ఆఫీసర్: హాలివుడ్ సంగతి సరే, నచ్చిన తెలుగు సినిమా?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మంచు పల్లకి సార్.
ఆఫీసర్: నీకు ఇష్టమైన క్రికెటర్?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మనోజ్ ప్రభాకర్.
ఆఫీసర్: ఇక నువ్వు వెళ్లవచ్చు... ఏమిటీ ఏదో అడగాలనుకుంటున్నావు?
క్యాండిడేట్: ఎంపీ సార్.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మై పెర్ఫార్మెన్స్?
ఆఫీసర్: ఎంపీ.
క్యాండిడేట్: అంటే?
ఆఫీసర్: నువ్వో మెంటల్ పేషెంట్ అని నా అభిప్రాయం.
క్యాండిడేట్: ఎంపీ.
ఆఫీసర్: అంటే?
క్యాండిడేట్: మై ప్లెజర్ సార్.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment