చేతిలో పార కళ్లల్లో స్కూలు | June 12th World Day agenaist Child Labour | Sakshi
Sakshi News home page

చేతిలో పార కళ్లల్లో స్కూలు

Published Sun, Jun 12 2016 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

చేతిలో పార కళ్లల్లో స్కూలు - Sakshi

చేతిలో పార కళ్లల్లో స్కూలు

జూన్ 12 వరల్డ్ డే అగెనైస్ట్ చైల్డ్ లేబర్
మన చదువులు తగలెయ్య! మన ప్రభుత్వాలకు సంకల్పం లేదు. మన నేతలకు చిత్తశుద్ధి లేదు. మనకు ఈ లక్షణాలే ఉన్నట్లయితే, దేశంలోని బాలలందరూ బడిలోనే ఉండేవారు. చెమట చిందించాల్సిన అగత్యం లేకుండా శుభ్రంగా చదువుల ఒడిలోనే సేదదీరేవారు. ప్రపంచవ్యాప్తంగా 16.8 కోట్ల మంది బాలకార్మికులు బడులకు వెళ్లలేక పనుల్లో మగ్గిపోతున్నారు. వీళ్లల్లో చాలామంది వెట్టిచాకిరిలో కట్టుబానిసల్లా బతుకుతున్నారు. మన ‘మహాన్ భారత్’లో 5-14 ఏళ్ల లోపు బాలల జనాభా దాదాపు 25.3 కోట్లు.

వీళ్లలో 1.26 కోట్ల మంది బడికి దూరమైన బాలకార్మికులే. పలకా బలపం పట్టుకోవాల్సిన చిట్టిచేతులు పలుగూ పారా పట్టుకుంటున్నాయి. అక్షరాలు దిద్దుకోవాల్సిన చేతులు మొరటు పనుల్లో నలిగి బొబ్బలెక్కుతున్నాయి. వాళ్లకు మాత్రం బడికి వెళ్లాలని ఉండదూ! తోటి చిన్నారులతో ఆటలాడుకోవాలని ఉండదూ! మనకు స్వాతంత్య్రం వచ్చి దాదాపు డెబ్బయ్యేళ్లవుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదానికి నలభై ఐదేళ్లు నిండాయి. అయినా ‘బాల’భారతాన్ని దారిద్య్రం పట్టి పీడిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇన్నాళ్లూ మన ప్రభుత్వాలు చేసిందేమిటి? చదువు సంధ్యలతో సమాజంలో ఉన్నత స్థితికి ఎగబాకిన ‘భద్ర’లోకులు చేస్తున్నదేమిటి?

ప్రపంచ జనాభా 700కోట్లు
వెట్టి కార్మికులు 2.98 కోట్లు
మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. వారిలో 25 కోట్లకు పైగా బాలలు ఉన్నారు. అయితే, వారిలో 1.26 కోట్ల మందికి పైగా బాలలకు బాల్యమే లేదు. బడిలో గడపాల్సిన ఈ చిన్నారులంతా బాల కార్మికులుగా వెళ్లదీస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) చొరవతో ఏటా జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి.

ఇదే తేదీకి కాస్త అటూ ఇటుగా మన దేశంలో బడిగంటలు మోగుతాయి. చాలామంది చిన్నారులు కొత్త యూనిఫామ్ దుస్తులు వేసుకుని, భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా స్కూళ్లకు వెళతారు. కళ్లెదుట బడి కనిపిస్తున్నా, బడిగంటలు చెవికి వినిపిస్తున్నా, లోలోపల బడికి వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా, చాలామంది చిన్నారులు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోతున్నారు.

తమ తోటి పిల్లలందరూ స్కూళ్లకు వెళుతుంటే, పలుగూ పారా చేతపట్టి పనుల్లోకి వెళుతున్నారు. చాలామంది పొలం పనులు, ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు బరువులెత్తే పనులు, చెత్తలు ఏరుకునే పనుల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు బాణసంచా కర్మాగారాలు, గనులు, రసాయన కర్మాగారాలు వంటి చోట్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమట చిందిస్తున్నారు.
 
ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికంగా 7.77 కోట్ల మంది బాల కార్మికులు చదువులకు నోచుకోకుండా చాకిరిలో మగ్గిపోతున్నారు. పశ్చిమాసియా-ఉత్తరాఫ్రికా దేశాల్లో 90 లక్షల మంది, సహారా ఎడారికి దిగువన ఉన్న మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో 5.9 కోట్ల మంది, లాటిన్ అమెరికన్ దేశాల్లో 1.25 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
మిథ్యగానే విద్యాహక్కు
దేశంలోని 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ విద్య ప్రాథమిక హక్కు. ఈ చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశాల్లో భారత్ 135వ దేశంగా అవతరించింది.

ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇంకా కోటి మందికి పైగా చిన్నారులు బడులకు దూరంగా, బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉండాల్సిన టీచర్ల కంటే 5.08 లక్షల మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాహక్కు మిథ్యగానే మిగిలిపోతోందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ప్రచారార్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు కాస్తంతైనా చిత్తశుద్ధితో విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టిపెడితే ఈ దుస్థితి ఉండేది కాదు.
 
బాలకార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు
వజ్రాల పరిశ్రమ:
తళుకులీనే వజ్రాల మెరుపుల వెనుక చిన్నారుల చెమట, నెత్తురు ఉన్నాయనే సంగతి ఎందరికి తెలుసు? భారత్‌లోను, పలు ఆఫ్రికన్ దేశాల్లోను వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఐఎల్‌ఓ దశాబ్దం కిందటే వెల్లడించింది. ఆ తర్వాత వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నది నిజమేనని దక్షిణ గుజరాత్ వజ్రాల పరిశ్రమ కార్మిక సంఘం అంగీకరించింది. అయితే, వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువేనని సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్‌లోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటే, వారిలో 20 వేల మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లు ఐఎల్‌ఓ అంచనా.
 
బాణసంచా పరిశ్రమ: మనదేశంలో బాణసంచా పరిశ్రమ చాలావరకు తమిళనాడులోని శివకాశిలోనే కేంద్రీకృతమై ఉంది. శివకాశిలోని నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మిగిలిన చోట్ల చాలావరకు బాణసంచా కర్మాగారాల్లో కనీస భద్రతా సౌకర్యాలు సైతం ఉండవనేది బహిరంగ రహస్యం. బాణసంచా పరిశ్రమలో దాదాపు లక్ష మందికి పైగా బాల కార్మికులు పని చేస్తున్నారు.
 
పట్టు పరిశ్రమ: కర్ణాటక, తమిళనాడులలో విస్తృతంగా ఉన్న పట్టు పరిశ్రమల్లో ఐదేళ్ల వయసు మొదలుకొని చాలామంది చిన్నారులు దాదాపు వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. పట్టు పరిశ్రమ యాజమాన్యాలు చిన్నారుల చేత రోజుకు పన్నెండు గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకుంటూ రోజుకు రూ.10-15 మాత్రమే చెల్లిస్తున్నాయని ఒక జర్మన్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. పట్టు పరిశ్రమలో పదివేల మందికి పైగానే బాల కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా.
 
గనులు: గనులలో పద్దెనిమిదేళ్ల లోపు వారి చేత పనులు చేయించరాదని చట్టాలు చెబుతున్నా, మన దేశంలో పలుచోట్ల గనుల యాజమాన్యాలు అనధికారికంగా బాల కార్మికులను వాడుకుంటూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని బొగ్గు గనుల్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా వేల సంఖ్యలో బాల కార్మికులు గనుల్లో పని చేస్తున్నట్లు ‘బచ్‌పన్ బచావో’ వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
కార్పెట్ల పరిశ్రమ: ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన కార్పెట్ల నేత పరిశ్రమల్లోనూ వేలాది మంది బాల కార్మికులు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది వెట్టిచాకిరిలోనే మగ్గిపోతున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు చిన్నారుల చేత అత్యంత కర్కశంగా బలవంతంగా పని చేయించుకుంటున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చినా, ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.
 ధాబాలు, రెస్టారెంట్లు: వ్యవసాయ పనులు, ఇళ్లల్లో పనుల తర్వాత బాల కార్మికులు అత్యధికంగా కనిపించేది ధాబాలు, రెస్టారెంట్లలోనే. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా బాల కార్మికులు ధాబాలు, రెస్టారెంట్లలో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.
 
చట్టాలు ఏమంటున్నాయి..?
బాల కార్మిక చట్టం, కర్మాగారాల చట్టం, గనుల చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం వంటి చట్టాలు బాల కార్మికుల చేత పనులు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. మన రాజ్యాంగం కూడా బాలల హక్కులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనుల్లో నియమించుకునే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.
 
ఇలా కూడా చేయవచ్చు!
సానుభూతి చూపే చూపుల కన్నా సాయం చేసే చేతులు మిన్న!

మీ ఇంట్లో, మీ పక్కింట్లో, మీ కాలనీలో... చైల్డ్‌లేబర్ కనిపించారా? మనసుకు బాధగా ఉందా! ఏదైనా చేయాలని ఉందా? అయితే ఇలా చేసి చూడండి... మీ  కాలనీలో మొక్కలు నాటడం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు... అందరూ కలిసి రకరకాల మంచి పనులు చేస్తారు. మీ కాలనీ వాసులంతా  చైల్డ్‌లేబర్‌ను దత్తత తీసుకొని పని మానిపించి బడికి పంపించడం కూడా మంచి పనే. మీ పాకెట్ మనీ నుంచి తలా కొంత చైల్డ్‌లేబర్‌కు ఇస్తే ఆర్థికంగా వారికి వెన్నుదన్నుగా ఉంటుంది. చదువు సాఫీగా సాగుతుంది. మనం సహాయం చేసిన బాలకార్మికుడు మంచి చదువులు చదివి ప్రయోజకుడైతే మన కాలనీకి ఎంత మంచి పేరు! ఒక్కసారి ఆలోచించండి.

చైల్డ్ లేబర్ ఓకేనా?
సినిమాలో మద్యం తాగే దృశ్యం వస్తే... ‘మద్యపానం  ఆరోగ్యానికి హానికరం’ అని - సిగరెట్ తాగితే ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలు తెర మీద కనిపిస్తాయి. హోటల్లో టీ సప్లై చేస్తూనో... నల్లగా మసిబారిన దుస్తులతో మెకానిక్ షెడ్‌లో పని చేస్తూనో... ఇలాంటి పనులు చేస్తున్న పిల్లల దృశ్యాలు తరచుగా వెండితెర మీద కనిపిస్తుంటాయి. మరి ఇలాంటి దృశ్యాలు వెండితెర మీద కనిపించినప్పుడు...
 
‘పిల్లలతో పని చేయించుకోవడం నేరం’
అనే హెచ్చరిక మాత్రం వేయకూడదా! పొగతాగడం, మద్యపానం వల్ల వ్యక్తి ఆరోగ్యమే దెబ్బతినవచ్చు. కానీ ‘బాల కార్మిక వ్యవస్థ’ వల్ల దేశ ఆరోగ్యమే దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ‘పిల్లలతో పని చేయించుకోవడం నేరం’ అనే హెచ్చరిక తప్పనిసరి అనిపిస్తుంది.
మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. వారిలో 25 కోట్లకు పైగా బాలలు ఉన్నారు. అయితే, వారిలో 1.26 కోట్ల మందికి పైగా బాలలకు బాల్యమే లేదు. బడిలో గడపాల్సిన ఈ చిన్నారులంతా బాల కార్మికులుగా వెళ్లదీస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) చొరవతో ఏటా జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. ఇదే తేదీకి కాస్త అటూ ఇటుగా మన దేశంలో బడిగంటలు మోగుతాయి. చాలామంది చిన్నారులు కొత్త యూనిఫామ్ దుస్తులు వేసుకుని, భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా స్కూళ్లకు వెళతారు.

కళ్లెదుట బడి కనిపిస్తున్నా, బడిగంటలు చెవికి వినిపిస్తున్నా, లోలోపల బడికి వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా, చాలామంది చిన్నారులు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోతున్నారు. తమ తోటి పిల్లలందరూ స్కూళ్లకు వెళుతుంటే, పలుగూ పారా చేతపట్టి పనుల్లోకి వెళుతున్నారు. చాలామంది పొలం పనులు, ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.

ఇంకొందరు బరువులెత్తే పనులు, చెత్తలు ఏరుకునే పనుల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు బాణసంచా కర్మాగారాలు, గనులు, రసాయన కర్మాగారాలు వంటి చోట్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమట చిందిస్తున్నారు.

ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికంగా 7.77 కోట్ల మంది బాల కార్మికులు చదువులకు నోచుకోకుండా చాకిరిలో మగ్గిపోతున్నారు. పశ్చిమాసియా-ఉత్తరాఫ్రికా దేశాల్లో 90 లక్షల మంది, సహారా ఎడారికి దిగువన ఉన్న మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో 5.9 కోట్ల మంది, లాటిన్ అమెరికన్ దేశాల్లో 1.25 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
మిథ్యగానే విద్యాహక్కు
దేశంలోని 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ విద్య ప్రాథమిక హక్కు.

ఈ చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశాల్లో భారత్ 135వ దేశంగా అవతరించింది. ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇంకా కోటి మందికి పైగా చిన్నారులు బడులకు దూరంగా, బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు.

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉండాల్సిన టీచర్ల కంటే 5.08 లక్షల మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాహక్కు మిథ్యగానే మిగిలిపోతోందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ప్రచారార్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు కాస్తంతైనా చిత్తశుద్ధితో విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టిపెడితే ఈ దుస్థితి ఉండేది కాదు.బాలకార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు
వజ్రాల పరిశ్రమ: తళుకులీనే వజ్రాల మెరుపుల వెనుక చిన్నారుల చెమట, నెత్తురు ఉన్నాయనే సంగతి ఎందరికి తెలుసు? భారత్‌లోను, పలు ఆఫ్రికన్ దేశాల్లోను వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఐఎల్‌ఓ దశాబ్దం కిందటే వెల్లడించింది. ఆ తర్వాత వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నది నిజమేనని దక్షిణ గుజరాత్ వజ్రాల పరిశ్రమ కార్మిక సంఘం అంగీకరించింది. అయితే, వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువేనని సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్‌లోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటే, వారిలో 20 వేల మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లు ఐఎల్‌ఓ అంచనా.
 
బాణసంచా పరిశ్రమ: మనదేశంలో బాణసంచా పరిశ్రమ చాలావరకు తమిళనాడులోని శివకాశిలోనే కేంద్రీకృతమై ఉంది. శివకాశిలోని నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మిగిలిన చోట్ల చాలావరకు బాణసంచా కర్మాగారాల్లో కనీస భద్రతా సౌకర్యాలు సైతం ఉండవనేది బహిరంగ రహస్యం. బాణసంచా పరిశ్రమలో దాదాపు లక్ష మందికి పైగా బాల కార్మికులు పని చేస్తున్నారు.
 
పట్టు పరిశ్రమ: కర్ణాటక, తమిళనాడులలో విస్తృతంగా ఉన్న పట్టు పరిశ్రమల్లో ఐదేళ్ల వయసు మొదలుకొని చాలామంది చిన్నారులు దాదాపు వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. పట్టు పరిశ్రమ యాజమాన్యాలు చిన్నారుల చేత రోజుకు పన్నెండు గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకుంటూ రోజుకు రూ.10-15 మాత్రమే చెల్లిస్తున్నాయని ఒక జర్మన్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. పట్టు పరిశ్రమలో పదివేల మందికి పైగానే బాల కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా.
 
గనులు: గనులలో పద్దెనిమిదేళ్ల లోపు వారి చేత పనులు చేయించరాదని చట్టాలు చెబుతున్నా, మన దేశంలో పలుచోట్ల గనుల యాజమాన్యాలు అనధికారికంగా బాల కార్మికులను వాడుకుంటూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని బొగ్గు గనుల్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా వేల సంఖ్యలో బాల కార్మికులు గనుల్లో పని చేస్తున్నట్లు ‘బచ్‌పన్ బచావో’ వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
కార్పెట్ల పరిశ్రమ: ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన కార్పెట్ల నేత పరిశ్రమల్లోనూ వేలాది మంది బాల కార్మికులు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది వెట్టిచాకిరిలోనే మగ్గిపోతున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు చిన్నారుల చేత అత్యంత కర్కశంగా బలవంతంగా పని చేయించుకుంటున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చినా, ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.
 
ధాబాలు, రెస్టారెంట్లు: వ్యవసాయ పనులు, ఇళ్లల్లో పనుల తర్వాత బాల కార్మికులు అత్యధికంగా కనిపించేది ధాబాలు, రెస్టారెంట్లలోనే. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా బాల కార్మికులు ధాబాలు, రెస్టారెంట్లలో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.
 
చట్టాలు ఏమంటున్నాయి..?
బాల కార్మిక చట్టం, కర్మాగారాల చట్టం, గనుల చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం వంటి చట్టాలు బాల కార్మికుల చేత పనులు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. మన రాజ్యాంగం కూడా బాలల హక్కులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనుల్లో నియమించుకునే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.
 
బాలకార్మిక వ్యవస్థకు కారణాలు
* పేదరికం
* తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన లేమి
* లింగ వివక్ష
* చిన్నారుల నిస్సహాయత
* పెట్టుబడిదారుల దోపిడీ ధోరణి
* ప్రభుత్వ వైఫల్యం
 
బాల్యాన్ని దోచే దొంగలు కావద్దు!
పసిపిల్లల విలువైన బాల్యన్ని దోచుకునే వారు క్రూరమైన దొంగలు. మీ ఇంట్లోనో, మీ షాప్‌లోనో... ఇంకా ఎక్కడైనా సరే పిల్లల్ని పనిలో పెట్టారంటే మీరు వారి బాల్యాన్ని దోచిన గజదొంగలైనట్లే. అందుకే ఆ తప్పు చేయవద్దు. వీలైతే వారి చదువుకు సహాయం చేసి మనసున్న మనిషి అనిపించుకోండి.
 
వీళ్లకు ఫిర్యాదు చేయాలి
ఎక్కడైనా మీకు బాల కార్మికులు తారసపడితే చూసీ చూడనట్లు వెళ్లిపోవద్దు. దయచేసి ఈ కింది చిరునామాలకు ఫిర్యాదు చేయండి.
రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం
టి. అంజయ్య భవన్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, హైదరాబాద్

ప్రాంతీయ కార్మిక కమిషనర్
ఏటీఐ క్యాంపస్, విద్యానగర్, హైదరాబాద్

ఇవి కాకుండా, మీ జిల్లా కేంద్రాల్లో ఉండే కార్మికశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే, సమీపంలోని ‘సాక్షి’ కార్యాలయంలో సమాచారం ఇవ్వవచ్చు.  పౌరులు కూడా తగిన తోడ్పాటునందిస్తే, బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింత అవకాశం ఉంటుంది.
 
అధికారులకు ఇలా ఫిర్యాదు చేయవచ్చు...
నమూనా పత్రం బాలయ్యకు చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేకపోతున్నాడు. కుటుంబానికి ఆసరా కోసం రోజూ కూలీ పని చేస్తున్నాడు. చదువుకోవాల్సిన వయసులో ఎండనక, వాననక కష్టపడుతున్నాడు. బాలయ్య ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతడిని బడిలో చేర్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement