కాపీ కళ వచ్చేసిందే బాలా!
‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన...
‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా
ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా
తద్దినక తాళం ఉంది ఆజా ఆజా’ పాట పెద్ద హిట్ అయింది.
ఈ సినిమాలోని పాటలకు మహేష్ సంగీతం సమకూర్చారు. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాల’ ట్యూన్ మాత్రం ఆఫ్రికన్ గాయకుడు మోరీ కాంటే ప్రసిద్ధ పాట ‘యే కే యే కే’ నుంచి తీసుకున్నారు.
గినియా దేశంలోని అల్‌బదరియ పట్టణానికి చెందిన మోరీ కాంటేకు వోకలిస్ట్‌గా మంచి పేరు ఉంది. పాటలు రాయడమే కాదు చక్కగా పాడగలడు కూడా. 1987లో విడుదలైన ‘యే కే యె కే’ పాటతో ఆయన పేరు మారుమోగిపోయింది. ఈ పాట అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది.