టేస్ట్ గ్రిల్లేయండి!
రొటీన్ వంటల కంటే... గ్రిల్డ్ చికెన్, గ్రిఫ్డ్ ఫిష్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలామంది వీటికోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఇకపై అలా బయటికి పరుగులు తీయకుండా, ఇంట్లోనే చికెన్, మాంసం, ఫిష్‌ను గ్రిల్‌పై వేయించొచ్చు. ఎలా అంటారా? ఫొటోలో కనిపిస్తున్నది ‘స్మార్ట్ గ్రిల్’. దీన్ని మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంత టెంపరేచర్‌పై మాంసం కాలాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ గ్రిల్ పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో పని చేస్తుంది. కేవలం నాన్ వెజ్‌నే కాదు... కూరగాయలను కూడా వీటిపై ఫ్రై చేసుకోవచ్చు.
వీటిపై వండటం వల్ల నూనె వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం. వంట త్వరగా కావాలంటే... టెంపరేచర్‌ను బాగా పెంచుకోవచ్చు (315 డిగ్రీల వరకు). అలాగే ఎంత టైమ్‌లో కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... వెంటనే గ్రిల్డ్ ఫుడ్‌ను ఇంట్లోనే తయారు చేసుకొని లాగించండి.