చంద్రబింబం: ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు రాగలసమయం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. వారం చివరిలో అనారోగ్యం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆస్తివివాదాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మొదట్లో కొంత నిరాశాజనకంగా ఉన్నా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని బాకీలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులతో విభేదాలు. ఒక ప్రకటన నిరుద్యోగులను నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు అసంతృప్తి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఈవారం పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వివాదాలు కొన్ని తీరతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో కుటుంబసభ్యులతో వివాదాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులతో సఖ్యత. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరమైన ఆప్తులు దగ్గరకు చేరతారు. వ్యాపార విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి కొత్త ఆశలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. అనారోగ్యం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. దూరపు బంధువుల నుంచి ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా పూర్తికాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు కేసు పరిష్కారమవుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
శ్రమ పెరిగినా ఫలితం దక్కుతుంది. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు పదవులుదక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు.
సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు