జస్టిస్ కోదండ రామయ్య
జస్టిస్ కోదండరా మయ్య నివాసంలో ఎందరో న్యాయవాదులు తయారయ్యారు. అలాగే మన పురాణాలపై అవగా హన పెంచడం గురించి, సనాతన ధర్మం కోసం కృషిచేసే వీరాభిమా నులూ తయారయ్యారు. ఇటీవల అస్తమించిన ఈ విశిష్ట న్యాయమూర్తి.. ఆధ్యాత్మిక సైన్యంలా మన ధర్మాన్ని ఆచరింపజేయగల యువతరం నేడు ఏర్పడాలని కాంక్షిస్తూ ఉండేవారు. కొన్నేళ్ల క్రితం నేను ఆయన నివాసానికి వెళ్లాను. మన ఇతిహాసాలను, పురాణాల గురించి తెలు సుకోవాలనే తపనతో అడుగుపెట్టిన ఒక యువ న్యాయవాదిగా నేను అడిగిన ఎన్నో ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానమిస్తూ ఆధ్యాత్మిక విలు వలను కాపాడే ప్రయత్నం చేశారు జస్టిస్. నా వ్యక్తిత్వాన్ని నాలాంటి వేలాదిమందిని తీర్చిదిద్దిన మహానుభావుల్లో జస్టిస్ కోదండరామయ్య చాలా ముఖ్యులు.
రామాయణం, మహాభారతం చదివితే ఏమి లాభం?
మహర్షి వాల్మీకి సాక్షాత్తూ వేదాన్నే కావ్యంగా రూపొందించారు. శ్రీ మహా భారతం 5వ వేదంగా వేదసారాన్ని తనలో నింపుకొన్న వేద వ్యాఖ్యాన గ్రంథంగా ప్రసిద్ధికెక్కింది. ఆ విధంగా ఈ రెండు మహాగ్రంథాలూ కేవలం ప్రాచీన చరిత్రను మాత్రమే కాక నిర్దిష్టమైన సందేశాన్ని మానవజాతికి ఇస్తు న్నాయి. రామాయణం అర్ధకామాలను గూర్చి విస్పష్టంగా, ధర్మాన్ని గురించి విస్తృతంగా వక్కాణి స్తుంది. వేదాల అర్థాలను వివరించి చెప్పటం రామా యణం లక్ష్యం.
మన ఇతిహాసాలు కనుమరుగయ్యే స్థితికి కారణం?
ఎందుకంటే ఈ గ్రంథాలు రెండూ మత పర మైనవి అనే ముద్రపడింది. అలాగే ధర్మ భావన కూడా మతపరమైనదే అని కొందరు అనుకుంటు న్నారు. అది రాజకీయ ఊహాగానాలతో ముడిపడి ఉంది. జాతి ప్రయోజనం దృష్టితో మనం దీనిని పరీ క్షించాలి.
ఇందులో పాశ్చాత్యుల ప్రమేయం ఎంత సార్?
పాశ్చాత్యులు వారి నిఘంటువులలో ఇలాంటి కావ్యాన్ని ‘ఎపిక్’ అని నిర్వచించారు. వారి నిర్వ చనం ప్రకారం ఎపిక్ అంటే దీర్ఘమైన కావ్యం. పూర్వులైన వీరుల చరిత్రను వర్ణించేది. కానీ అది మైథాలజీ (మిథ్) అనగా ఇది నిజమైన విషయం కాకున్నా, నిజంగా భావించి ప్రజలు దానిని నమ్ము తారు. ఈ ఎపిక్‌ను లెజండరీ కథగా చెప్తారు. అనగా నిజంగా జరగనిది. కానీ ప్రజలందరూ నమ్ముతారు. నిజము కానప్పటికీ అని వారి నిర్వచనము. వర్డ్స్ వర్త్ ఎన్‌సైక్లోపీడియాలో ఈ ఎపిక్ దీర్ఘమైన కావ్యం. అది కాస్మోలాజికల్– మనుష్యులకు, దేవతలకు సంబంధించిన కావ్యం. అలాంటి ఎపిక్స్ అన్ని జాతులకు లేవు. గ్రీకు దేశస్తుడు హోమర్ రచించిన ఇలియడ్ ఒడిస్సీ అతిముఖ్యమైన ప్రఖ్యాతి చెందిన ఎపిక్. అలాగే మన రామాయణ భారతాలు కూడా ఎపిక్స్‌గా గుర్తింపు పొందాయి. ఆ నిర్వచనం ప్రకారం ఈ ఎపిక్ జాతికి ఆధారభూతమైనది లేదా జాతీయ భావాన్ని సమకూర్చేది, మత విషయమై నది కావచ్చు లేక దివికి భువికి చెందిన కథ కావచ్చు.
పాశ్చాత్యుల ‘ఎపిక్’ మన పురాణాలకు లేవా?
మన రామాయణం, భారతం దివికి భువికి చెందిన కావ్యాలు కనుక పాశ్చాత్యులు వర్ణించిన ఎపిక్ లక్షణాలు ఈ కావ్యాలకు కూడా ఉన్నాయి. కానీ మన దేశపు ఈ రెండు కావ్యాలు పాశ్చాత్యులు వర్ణించే దివికి చెందిన విషయాలు మాత్రమే కాక, ఇవి ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇతి హ ఆస – ‘ఇట్లు జరిగినది’ అని అర్థం. ఈ దేశస్థులు ఎవరూ రామాయణం, భారతంలోని వీరులు కల్పనగా అబ ద్ధంతో వర్ణించారని ఎన్నటికీ తలవరు. కారణం వాటిలోని అవతారమూర్తులైన రాముడు, కృష్ణుడే కాక అంతకుముందు మన దేశస్థులు అవతారమూ ర్తుల అవతరణ ఎరిగి వారిని ఆరాధించిన మహ నీయులు. ఈ కావ్యములలోని వివిధ వర్ణనలు కల్ప నలుగా ఎప్పుడూ తలవరు. ప్రస్తుతం ఆంగ్ల విద్య చదివి యువతరం వారు, ప్రభుత్వాధికారులు రామా యణ భారతాలను ఎపిక్‌గా మాత్రమే భావించినం దువలన సేతు ప్రస్తావన విషయంలో అధికారులు కూడా రాముడు పుట్టినట్లు ఆధారము లేదని చెబు తున్నారు. దీనికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇందుకు కారణం మన పాఠ్య ప్రణాళికల్లో ఈ మహా కావ్యాలను పూర్తిగా పరిహరించడమే.
సీఎస్ రంగరాజన్
వ్యాసకర్త వంశపారంపర్య ధర్మకర్త, ప్రధాన అర్చకులు, చిలకూరు బాలాజీ దేవాలయం
Comments
Please login to add a commentAdd a comment