ఒకరితో వివాహ ఒప్పందంలో ఉండి వేరొకరితో సంబంధాలు కలిగి ఉండటం ఎవరు చేసినా తప్పే. కానీ ఈ పని స్త్రీ చేస్తేనే ఘోరమనడం ద్వంద్వ ప్రమాణం. వివాహేతరబంధంలో ఉన్న భార్యపైనో, ఆ వేరే పురుషుడిపైనో నేరం మోపే అధికారం ఉన్నంత మాత్రాన దాంపత్యం చక్కబడుతుందా? వివాహేతర బంధం నేరంగా ఉన్నంత కాలం వివాహేతర సంబంధాలు లేవా? ఉన్నాయి. ఉండటమేగాదు ఇటీవలికాలంలో బాగా పెరిగాయి. వీటిని నివారించాలంటే పెళ్లి వ్యవహారం సరళతరం కావాలి. ప్రేమ, సమానత్వం ప్రాతిపదికన పెళ్లిళ్లు జరగడం అవసరం. ‘నాకు అన్ని రకాల హక్కులూ కావాలి గాని నా భార్యకు ఏ హక్కూ వద్దు’ అనే ‘మగ దృష్టి’ కోణం నుంచి సమాజం బయటపడాలి. మానవ సంబంధాల్లో అన్నిరకాల హింసలూ పోవాలి.
సెక్షన్ 497 చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నప్పటి నుంచి టీవీ చాన ళ్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో రెండు అభిప్రాయాలు కలు గుతాయి. ఒకటి వివాహే తర సంబంధాలకు సుప్రీం కోర్టు లైసెన్సు ఇచ్చిందని. ఈ సెక్షన్ వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకోవ డానికి స్త్రీలు భయపడటం వల్లే వివాహ వ్యవస్థ నిలిచి ఉందనీ, ఇక ఛిద్రమైపోతుందనేది రెండోది. ఈ సెక్షన్ రద్దయితే కుటుంబ వ్యవస్థను కాపాడటం కష్ట మనే ధోరణితో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. భర్త అనుమతి లేకుండా భార్య వేరే పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకున్నాక, అది రుజువైతే అతనికి ఐదేళ్ల జైలు, జరిమానా విధించవ చ్చని 158 ఏళ్ల నాటి ఈ సెక్షన్ చెబుతోంది. అయితే, తన భార్యపై కేసు పెట్టే అధికారం అతనికి లేదు. అలాగే, ఈ స్త్రీతో సంబంధం ఉన్న పురుషుడి భార్యకు అతనిపై కేసు వేసే హక్కు కూడా లేదు.
నేడు ఇంగ్లండ్ సహా అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగ ణించే చట్టాలు రద్దు చేశారు. ఇది వినగానే, పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడి సంబంధాలుంటాయని, మన దేశం అలా లేదని కొందరంటున్నారు. ‘‘వివాహేతర సంబంధం విడాకులకు ప్రాతిపదిక కావచ్చు కాని, దాన్ని నేరంగా పరిగణించలేం’’ అని తీర్పు ప్రారం భంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. టీబీ మెకాలే ఈ చట్టం రాసినప్పుడు పురుషులు విచ్చలవిడిగా తిర గడం, అనేక పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. స్త్రీలకు కూడా కోర్కెలుంటాయని తెలుసు కాబట్టే భర్తల నిరాదరణకు గురైన స్త్రీలు తమ కోర్కెలు తీర్చు కుంటే వారిని శిక్షించడం అన్యాయమని భావించి వారిపై వ్యభిచార నేరం మోపొద్దని చెప్పాడు. కుటుం బాన్ని కాపాడటానికి ఇది అవసరమని ఇంగ్లిష్ ప్రమాణాలతో ఆలోచించి ఆయన అనుకున్నారు.
కానీ, వ్యభిచార గృహాల్లోనే మకాం పెట్టిన భర్త తన భార్య వేరేవాడికేసి చూసినా చంపేయడమో లేదా వదిలేయడమో చేస్తాడన్న వాస్తవం భారత మహిళలకు తెలుసు. అసలు ఈ చట్టం అంతా మగ వాడు తన ఆస్తిగా భావించే స్త్రీ శరీరాన్ని మరొకరికి ఇవ్వడానికి సంబంధించినది. అందుకే స్త్రీ స్వతంత్ర వ్యక్తి అనీ, పురుషుడి ఆస్తి కాదనీ, ఆమెకూ ఇష్టాయి ష్టాలుంటాయని సుప్రీంకోర్టు భావించింది. వివాహే తరబంధం వల్ల పెళ్లి విచ్ఛిన్నమవుతుందా? లేక వివాహబంధం విఫలం కావడంవల్ల వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయా? అనే అంశం ఆలో చించాలని కోరింది. సంతృప్తికర దాంపత్య జీవితం గడిపే భార్యాభర్తలు అసలు వివాహేతర సంబం ధాలు ఎందుకు ఏర్పరచుకుంటారు? తన భార్య శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునే భర్తలే ఎక్కు వగా ఉన్న దేశమిది. తమకు కూడా లైంగిక వాంఛ లున్నాయనీ, ఆ సుఖం తమకూ కావాలని అడిగే స్త్రీలను సిగ్గుమాలినవారిగా, బరితెగించిన వారిగా ఇప్పటికీ భావించే దేశంలో సుప్రీంకోర్టు తీర్పుపై గగ్గోలు పుట్టడంలో వింతేమీ లేదు.
స్త్రీలకు లైంగిక సమానత్వం ఉండాలనడం వివా హేతర సంబంధాల్ని, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిం చడం కాదు. లైంగిక సుఖం, సంతృప్తి స్త్రీల హక్కు అని చెప్పడమే. ‘మగాడు తిరగక చెడతాడు’ అని చెప్పే సమాజంలో మగాడి తిరుగుబోతుతనానికి ఆమోదం ఉంది. అత్యాచార బాధితురాలైన స్త్రీని చెడి పోయిందంటారు. ఆమె శీలం పోతుందంటారు. కానీ అత్యాచారం చేసిన పురుషుడి శీలం పోదు. అతన్ని దుష్టుడు అని మాత్రమే అంటారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి ద్వారా జతకట్టడం అనే పద్ధతిని కోరుకున్నది స్త్రీయేనని సామాజిక శాస్త్రవేత్తలు చెబు తారు. కానీ, ఈ రకమైన దాంపత్యం స్త్రీని కనీస హక్కులు లేని బానిసగా మార్చడమే అభ్యంతర కరం. స్త్రీ, పురుష సంబంధాలు అసమాన స్థాయిలో ఉన్నంత కాలం అసంతృప్తి ఉంటుంది. దానిని వెన్నంటే వివాహేతర సంబంధాలు ఉంటాయి.
ఒకరితో వివాహ ఒప్పందంలో ఉండి వేరొక రితో సంబంధాలు కలిగి ఉండటం ఎవరు చేసినా తప్పే. కానీ ఈ పని స్త్రీ చేస్తేనే ఘోరమనడం ద్వంద్వ ప్రమాణం. వివాహేతరబంధంలో ఉన్న భార్యపైనో, ఆ వేరే పురుషుడిపైనో నేరం మోపే అధికారం ఉన్నంత మాత్రాన దాంపత్యం చక్కబడుతుందా? వివాహేతర బంధం నేరంగా ఉన్నంత కాలం వివా హేతర సంబంధాలు లేవా? ఉన్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వీటిని నివారించాలంటే పెళ్లి వ్యవహారం సరళతరం కావాలి. ప్రేమ, సమా నత్వం ప్రాతిపదికన పెళ్లిళ్లు జరగడం అవసరం. వివాహేతర సంబంధం నేరంగా ఉంటే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే సమాన హక్కుంటే దాంపత్యం చక్కబడుతుందా? ‘నాకు అన్ని రకాల హక్కులూ కావాలి గానీ నా భార్యకు ఏ హక్కూ వద్దు’ అనే ‘మగ దృష్టి’ కోణం నుంచి బయట పడాలి. అందరికీ సమాన హక్కులుండాలి. మానవ సంబంధాల్లో అన్ని రకాల హింసలూ పోవాలి.
పి. దేవి
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త
ఈమెయిల్ : pa_devi@rediffmail.com
Comments
Please login to add a commentAdd a comment