సాక్షి, హైదరాబాద్: మద్యం కొనుగోళ్లు, అమ్మకాల కోసం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్(టీఎస్‌బీసీఎల్)ను కొనసాగించాలని సర్కారు ఏ ముహూర్తంలో నిర్ణయించిందో గాని రాష్ట్రం మీద ఆర్థికంగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత నెలలో ఆదాయపు పన్ను శాఖ 2011-12, 2013- 14 బకాయిల కింద ఏకంగా రూ. 1274 కోట్లు తెలంగాణ సర్కారు ఖాతా నుంచి లాగేసుకున్న ఘటన మరువకముందే తాజాగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ టాక్స్ అధికారులు మరో బాంబు పేల్చారు. పన్ను చెల్లింపుల వివరాలు కావాలని సెర్చ్ వారెంట్‌తో గురువారం టీఎస్‌బీసీఎల్‌కు వచ్చిన ఆ శాఖ అధికారులు 20 అంశాల్లో వివరాల కోసం సోదాలు జరుపుతామని నోటీసులు ఇచ్చారు.
2010-11 నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించనందున ఆ కార్పొరేషన్‌కు కొనసాగింపుగా ఉన్న టీఎస్‌బీసీఎల్ ఆ సొమ్ము చెల్లించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కాలం 2010 నుంచి 2014 జూన్ వరకు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి సాగిన ఏడాది అమ్మకాలపై పన్ను కలుపుకొని దాదాపు రూ. 700 కోట్ల వరకు సర్వీస్ టాక్స్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో దిమ్మ తిరిగిన అధికార యంత్రాంగం హుటాహుటిన ప్రభుత్వానికి సమాచారం అందించింది.
బకాయిల బాదుడు !
Published Fri, Jul 24 2015 3:14 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement
Advertisement