కార్పోరేట్ ఆసుపత్రి అమానుషం
కార్పోరేట్ ఆసుపత్రి అమానుషం
Published Wed, Dec 7 2016 6:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ పట్ల ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రి దారుణంగా ప్రవర్తించింది. పాప పుట్టి 12 రోజులైనా ఇప్పటివరకూ తల్లికి చూపించకుండా దాచిపెట్టింది. బిడ్డను తమకు చూపాలని మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఆసుపత్రి వర్గాలు దిగొచ్చాయి. చిన్నారిని కన్నతల్లికి చూపించాయి. కాన్పు సమయంలో చిన్నారి తలకు గాయమైందని.. శిశువుకు ప్రత్యేక శస్త్ర చికిత్స అందిస్తున్న కారణంగానే ఇన్ని రోజులూ కన్నతల్లికి చూపించలేదని పేర్కొన్నాయి.
దీంతో ఆగ్రహించిన మహిళ కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి తలకు గాయమైందని, తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇన్ని రోజులు ఆసుపత్రి కాలయాపన చేసిందని ఆరోపించారు. ఆపరేషన్ సమయంలో శిశువు తలకు కత్తెర తగలడం వల్ల గాయమైనట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement