పసికందు మృత దేహం పాఠశాల ఆవరణలో కలకలం రేపింది.
పసికందు మృత దేహం పాఠశాల ఆవరణలో కలకలం రేపింది. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో బుధవారం వెలుగుచూసింది. స్థానిక సేయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలో పసికందు మృతదేహం పడిఉంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు.