జమ్మూకశ్మీర్ లో భూకంపం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు పాంత్రాల్లో భూమి కంపించినట్లు తెలిపింది. భూమి స్వల్పంగా కంపించడంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, గత కొద్ది రోజులుగా నేపాల్-భారత్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి.