హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్టు
Published Fri, Nov 27 2015 12:05 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
హైదరాబాద్: హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 55 గ్రాముల ఎల్ఎస్డీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేసి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముఠాలో ముగ్గురు ఆఫ్రికన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న వాటిపై పోలీసులు విచారిస్తున్నారు.
Advertisement
Advertisement