రజనీకాంత్‌కు కరుణానిధి పుట్టినరోజు శుభాకాంక్షలు | karunanidhi wish 'superstar' Rajinikanth on his 65th birthday | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు కరుణానిధి పుట్టినరోజు శుభాకాంక్షలు

Published Sun, Dec 13 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

karunanidhi wish 'superstar' Rajinikanth on his 65th birthday

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ శనివారం 65వ ఏటలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు వేడుకకు రజనీ అంత ప్రాధాన్యత ఇవ్వకున్నా ఆయన అభిమానులు పూజలు, పాలాభిషేకాలు,సేవా కార్యక్రమాలు అంటూ భారీ హంగామానే చేస్తారు.

అలాంటిది ఈ ఏడాది తుపాన్ తమిళనాడుకు ముంచెత్తిన కారణం తనపుట్టిన వేడుకలను నిర్వహించవద్దని రజనీకాంత్ తన అభిమానులకు విజ్ఞప్తి చేయడంతో పాటు తుపాన్ బాధితులను ఆదుకునే కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం కబాలి చిత్రం కోసం గోవాలో ఉన్న రజనీకాంత్‌కు డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ ఫోన్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement