Rajinikanth Assets And Net Worth Value: సూపర్ స్టార్ రజనీకాంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగారు ఆయన. ఇప్పటికీ రజనీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లో ఫ్యాన్స్ క్యూ కట్టాల్సిందే. అంతగా అభిమానుల ఆదరణ దక్కించుకున్న ‘తలైవా’ బర్త్‌డే నేడు(డిసెంబర్ 12). ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 70 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే రజనీకాంత్ సినిమాల ద్వారానే బాగానే సంపాదించారు.
చదవండి: అల్లు అర్జున్ ‘పుష్ప’ ప్రి-రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా?
అత్యధికంగా సంపాదిస్తున్న తారల జాబితాలో రజనీకాంత్ ముందంజలో ఉంటారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో రజనీ. ఈ నేపథ్యంలో ఆయన నికర ఆస్తులకు సంబంధించిన వివరాలు హాట్‌టాపిక్ మారాయి. కక్నా లెడ్జ్ 2021 నివేదిక ప్రకారం.. రజనీ నికర ఆస్తుల విలువ 360 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఆయన సినిమాల ద్వారా సంపాదించారు. కాగా ఎలాంటి కమర్షియల్ యాడ్స్ చేయడనే విషయం తెలిసిందే. దీంతో కేవలం సినిమాల ద్వారానే ఆయన ఇంత డబ్బు సంపాదిస్తే ఇంకా యాడ్స్ ద్వారా ఎంత సంపాదించేవారో అంటున్నారు. సగటున రజినీ ఒక్కో సినిమా 60 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని సమాచారం. ఈ నివేదిక ప్రకారం రజనీ 100-120 కోట్ల రూపాయల పెట్టుబడిని కలిగి ఉన్నారట.
చదవండి: ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్
1950 డిసెంబర్ 12న కర్ణాటక మరాఠి కుటుంబంలో పుట్టిన రజనీ ‘అపూర్వ రాగంగళ్’(1975) అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు పనిచేశారు. ఈ క్రమంలో 1982లో ‘అంధా కానూన్’ సినిమాతో రజనీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు హేమమాలిని, రీనారాయ్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ తన మ్యాజిక్‌ని చూపించారు ఆయన. ఆ తర్వాత సౌత్‌తో పాటు హిందీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఇక రజనీకాంత్ ఇటీవల నటించిన అన్నాత్తై సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమాను తెలుగులో పెద్దన్నగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment