ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు బంద్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై రాకపోకలను నియంత్రిం చేందుకు ఏర్పాటుచేసిన ఔట్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు గురువారం భక్తుల నిరసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. మావోయిస్టులు లేనేలేరని చెప్పే పోలీ సులు.. పుష్కరస్నానం కోసం వచ్చే భక్తులకు ఇలా ఇబ్బంది కలిగించడం ఏమిటని ప్రశ్నించారు.
బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు నడకదారిలో వచ్చేందుకు కొంతసేపు భక్తులను అనుమతించారు. మావోయిస్టులు వస్తారనే కారణం చూపుతూ ముల్లకట్ట బ్రిడ్జిపై భక్తుల రాకపోకలపై పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి నిషేధం విధిం చారు. మావోయిస్టుల అంశంతోపాటు పుష్కర పనులు చేసిన కాంట్రాక్టర్లను సంతృప్తి కలిగిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
పుష్కర స్నానానికి అనుకూలంగాలేని ముల్లకట్టలో ఘాట్‌ను నిర్మించడంపైనే విమర్శలు తలెత్తుతున్నాయి. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని వరంగల్ జిల్లాలో గోదావరి తీరం వెంట మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టలో పుష్కరస్నానాలకు అనుగుణంగా ఘాట్లను నిర్మిం చారు. ముల్లకట్ట వద్ద అవసరం లేకున్నా, సౌకర్యంగా ఉం డకున్నా రూ.4 కోట్లతో ఇక్కడ ఘాట్ నిర్మించి, నీటి పంపులు ఏర్పాటు చేశారు.
పుష్కరాలు మొదలైనా ముల్లకట్ట వద్ద ఘాట్‌కు సమీపంలో గోదావరి ప్రవాహం లేదు. దీంతో భక్తులకు ఘాట్‌లో పుష్కరస్నానం చేసే సౌకర్యం లేకుండాపోయింది. ముల్లకట్టలో పుష్కరఘాట్ ఏర్పాటు ప్రతిపాదన తప్పనే విషయం బయటపడకుండా ఉండేం దుకు.. అధికారులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల నిషేద నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
అడ్డుకట్టపై భక్తుల ఆగ్రహం
Published Fri, Jul 17 2015 1:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement