చెన్నై: ప్రమాదంలో ఉన్న వారిని త్వరగా ఆస్పత్రికి చేర్చడం కోసం అంబులెన్స్ కు సైరన్ ఉంటుంది. ఈ సైరన్ వినగానే మార్గం మధ్యలో అంబులెసన్స్ కు దారి వదులుతారు. కానీ రోగులు లేకుండా అతి వేగంగా వెళ్లిన ప్రైవేటు ఆంబులెన్స్‌లకు పోలీసులు జరిమానా విధించారు. కరూర్ జిల్లా రాయనూర్ నార్త్ రోడ్డుపై రెండు అంబులెన్స్ వ్యాన్‌లు ఒకదాని వెనుక అతి వేగంగా సైరన్ మోగించుకుంటూ వెళ్లాయి. ఏదైనా ప్రమాదం జరిగిందా ? అనే భయంతో ప్రజలు దిగ్భాంది చెందారు.
దీనిపై పశుపతి పాళయం పోలీసులు స్పందించారు. సదరు వ్యాన్‌లను ఆపి పరిశీలించగా అందులో రోగులేవరూ లేరు. పొంతన లేని సమాధానాలు ఇవ్వటంతో ఇద్దరికీ డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా లేనట్లు తేలింది. డ్రైవర్లు ముత్తురాజాపురంకు చెందిన సుగన్(24), తిరుమానిలయూర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్(21)లకు ఒక్కొక్కరికి రూ.1500 జరిమానా విధించారు.
ఆకతాయి డ్రైవర్లకు జరిమానా
Published Wed, Jul 19 2017 5:43 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement