హైదరాబాద్ లో కుంగిన భవనం
Published Wed, Jan 20 2016 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
హైదరాబాద్: ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం భూమిలోకి కుంగి ప్రమాదకరంగా మారింది. వివరాలివీ.. బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లోని భవానీనగర్ శ్రీ కనకదుర్గా టెంపుల్ వెనుక వైపు ప్రాంతంలో ఏడంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. ఈ భవనం బుధవారం ఉదయం అకస్మాత్తుగా కొద్దిభాగం భూమిలోకి కుంగింది. దీంతో భవనంలో పని చేస్తున్న కూలీలు, చుట్టుపక్కల స్థానికులు భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Advertisement
Advertisement