ప్రేమించిన అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో.. ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమించిన అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో.. ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలోని గాంధీనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుజ్జల సాయినాథ్(22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.