sainath
-
రైతు సంక్షేమంలో ఆంధ్రా అద్భుతం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి చేపట్టిన చర్యలన్నింటినీ మనçస్ఫూర్తిగా సమర్థిస్తున్నా. ప్రత్యేకించి రైతుభరోసా కింద అందిస్తున్న పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా వంటి పథకాలు అద్భుతం. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతుల్ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ చాలా బాగున్నాయి. వాటన్నింటినీ ప్రశంసిస్తున్నా. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు రాకుండాపోతే రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే కదా.. ఆ పని ఏ ప్రభుత్వం చేసినా హర్షణీయమే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.ఆ విధానాలన్నీ నచ్చాయి కనుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఏపీ వ్యవసాయమిషన్లో సభ్యుడిగా ఉన్నా.. ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ వ్యవసాయ మిషన్ సభ్యుడు డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ మాటలివి. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు – వ్యవసాయంపై వాటి ప్రభావం గురించి గుంటూరులో ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఈ గ్రామీణ జర్నలిస్టు సాయినాథ్ ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దుపై జరుగుతున్న పోరాటం మొదలు మీడియా తీరుతెన్నుల వరకు అనేక అంశాలపై ఆయన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. పార్లమెంటు సంపన్నుల పరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ అందరికీ రాలేదన్నారు. నోరూవాయ లేని సామాన్యుడికి గొంతుకగా ఉండాల్సిన మీడియా సైతం కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కిందని చెప్పారు. స్వాతంత్య్రం కోసం రక్తమాంసాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగధనులకు ఈవేళ దేశంలో నెలకొన్న పరిస్థితి క్షోభకలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రైతు కోసం ఏంచేసినా మంచిదే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఏర్పాటు హర్షణీయం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడా ఆ హామీని విస్మరించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగు వ్యయాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టింది. వాటిల్లో ఆర్బీకేలు ఒకటి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి. వ్యవసాయ మిషన్‌లో నేనూ సభ్యుడిగా ఉన్నా. రైతును క్షేమంగా ఉంచేందుకు ఏంచేసినా మంచిదే. ఆర్బీకేలు ఎలా పనిచేస్తున్నాయో నేను తెలుసుకుంటున్నా. వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. వ్యవసాయంపై ఏదైనా చట్టాన్ని తేవాలంటే దేశంలోని మూడింట రెండు వంతుల రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదం తెలపాలి. అటువంటిదేమీ లేకుండానే కేంద్రం చట్టాలు తెచ్చింది. ఈ తీరును నిరసించాలి. ఆ చట్టాల్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అవి అమల్లోకి వస్తే చిన్న, సన్నకారు రైతులు ప్రత్యేకించి కౌలురైతులు బాగా చితికిపోతారు. అందుకే ఈ చట్టాలను వ్యతిరేకించమని ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అది సంపన్న రైతుల పోరాటమా?.. మతిలేని మీడియా ప్రచారమది.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 8 నెలలుగా సాగుతున్న రైతు పోరాటంపై ఐఎంఎఫ్ డైరెక్టర్‌గా ఉన్న సూర్జత్ భల్లా వంటి అపర మేధావులు, కొన్ని మతిలేని మీడియా సంస్థలు పేలేవి అవాకులు చెవాకులు. అది సంపన్న రైతుల పోరాటమని, నాలాంటి వాళ్లు సంపన్న రైతుల సోషలిజం కోసం పోరాడుతున్నామంటూ వెటకారమాడుతున్నారు. వాళ్ల మాదిరిగా కార్పొరేట్ల సోషలిజం కోసం పోరాడలేం కదా.. అందుకే రైతులకు మద్దుతు ఇస్తున్నాం. ఒక్కసారి పంజాబో, హరియాణానో, ఉత్తరప్రదేశో వెళ్లి చూస్తే ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు సాదాసీదా రైతులు ఎంత కష్టపడుతున్నారో, తాము తినకపోయినా పర్లేదు, ఈ రూపాయి ఉంచండని ఎంతలా దాతృత్వం చూపిస్తున్నారో తెలుస్తుంది. రైతు ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఒక్కరోజులో సంపాయించే వాళ్లకు ఢిల్లీ పోరాటం ఏమర్థమవుతుంది? ప్రజాస్వామ్య చరిత్రలో అదో మహత్తర పోరాటం. దాని విలువ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి దేవాలయమంటున్న పార్లమెంటులో సామాన్యులకు చోటులేకుండా పోతోంది. 2004లో 32 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులైతే 2019 నాటికి ఇది 88 శాతానికి చేరింది. సమాజంలో అత్యధికులుగా ఉన్న వర్గాలకు వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే భయం వేస్తోంది. పేద ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్నదే నా ఆవేదన. స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగశీలురు ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చిన ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తున్నారు. స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ కొందరికే పరిమితమైంది. అయినప్పటికీ ఈ దేశ ప్రజలు చాలా శక్తిమంతులనే నా భావన. 1971లో దక్షిణ ముంబై నుంచి నావల్ టాటా అనే సంపన్నుడు పార్లమెంటుకు పోటీచేశారు. ఆయనకు ఎంత మెజారిటీ రావచ్చని పోల్ పండిట్లు లెక్కిస్తుంటే ఆ ప్రాంత ప్రజలు అనామకుడైన ఓ ట్రేడ్ యూనియన్ లీడర్ కైలాష్ నారాయణ్‌ను గెలిపించారు. అందువల్ల ఈ దేశ ప్రజలపై నాకు అపార విశ్వాసం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పక తమ ఆయుధాన్ని బయటకు తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు. పెట్టుబడి సాయం అద్భుతం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం, ధరల స్థిరీకరణ నిధి, కనీస మద్దతు ధరలకు పంటల కొనుగోలు వంటివి ప్రాధాన్యత కలిగినవి. వాటికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. వీటితోపాటు చాలా సానుకూల నిర్ణయాలున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఏడాది కాలంగా అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోలేదు. అవి ఎలా పనిచేస్తున్నాయో చూడాల్సి ఉంది. పథకాల వరకైతే అవి అద్భుతం. -
ఆ మూడు చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం
(గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు, జాతి, రాజ్యాంగ వ్యతిరేకమైనవని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ సభ్యుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఆ చట్టాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో 180 రోజులుగా జరుగుతున్న పోరాటం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక నిరసన అని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు – వ్యవసాయం, ప్రజలపై ప్రభావం అనే అంశంపై ఆదివారం గుంటూరులో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రెట్టింపు ఆదాయం అటకెక్కిందా? 2017 జనవరిలో ప్రధాని, ఆర్థికమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2022 నాటికి అంటే మరో 4 నెలల్లో రైతుల ఆదాయం రెట్టింపు కావాలి. ఆ హామీ ఇచ్చిన పెద్దలు ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. రైతు ఆదాయం పెరక్కపోగా తగ్గిపోతోంది. 2013 నాటి జాతీయ నమూనా సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబ ఆదాయం నెలకు సగటున రూ.6,426. కరోనాతో ఆ ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని పెద్ద కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలేసేందుకు కుట్ర పన్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నారు. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ వ్యవసాయ చట్టాలపై వివాదాలను కోర్టులకు బదులు కలెక్టర్లు, తహసీల్దార్లతో ఏర్పాటయ్యే అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లోనే తేల్చుకోవాలన్నారు. కనుక ఇది జాతి వ్యతిరేకం. అధికారులు తీసుకున్న చర్యల్లో, చేసిన సెటిల్మెంట్లలో సివిల్ కోర్టులు సహా ఇతరులు జోక్యం చేసుకునే అధికారం లేదంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రమాదకరమో ఊహించండి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే కార్పొరేట్ లేదా కాంట్రాక్ట్ సేద్యం చేయించే సంస్థలు చెప్పింది చేయాలే తప్ప రైతుల ప్రమేయం ఏమీ ఉండదు. రైతు నిపుణులతో కిసాన్ కమిటీ వేసి సాగుదార్ల వాస్తవ స్థితిగతులను పరిశీలించాలి. సాగురంగ సమస్యల్ని చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం నిర్వహించాలి. ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు కిసాన్ బచావో కమిటీలు వేసి ఊరూరా ప్రచారం, ఆందోళనలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే పాలకులు దిగివస్తారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు. ఏపీ కౌలురైతుల సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం నాయకుడు వి.కృష్ణయ్య, కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెన్నైలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో బీటెక్ మూడో సంవత్సరం చదుతున్న సాయినాథ్ మంగళవారం కాలేజ్ హాస్టల్ భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయినాథ్ స్వస్థలం విజయవాడలోని నారాయణలింగాపురం. కాలేజ్ యాజమాన్యం రూ.10 వేల ఫైన్ విధించారని.. దీంతో మనస్థాపం చెందిన సాయినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యపై సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థిలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు నెలల క్రితం సత్యభామ యూనివర్సిటీలో చదవుతున్న రాధ మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన మౌనిక ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా కాపీ కొట్టిందని.. ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుట్ల స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఓ బొలెరో ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సాయినాథ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి రతలించారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని..
ప్రేమించిన అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో.. ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలోని గాంధీనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుజ్జల సాయినాథ్(22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు పట్టణంలోని శివప్రియ హోటల్ సమీపంలో నివసించే సాయినాథ్ (30) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ కలహాలకు తోడు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాయినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయినాథ్ ఆత్మహత్యపై దర్యాప్తు
ఫోన్‌కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సమయం వరకు సాయినాథ్ ఎవరితో మాట్లాడింది.. అసలు అతడి సెల్‌ఫోన్ ఎక్కడుంది అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు సాయినాథ్ ఉన్న కొంపల్లిలోని రామ్ రితేశ్ బాయ్స్ హాస్టల్‌కి వచ్చి అక్కడి విద్యార్థులను సాయినాథ్ గురించి ఆరా తీశారు. సాయినాథ్ తమతో ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసుల విచారణలో వారు వెల్లడించారు. ఆగస్టు 17న సాయినాథ్ అన్నయ్య రఘునాథ్ వచ్చి హాస్టల్లో చేర్పించారని హాస్టల్ నిర్వాహకురాలు అర్చన తెలిపింది. సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలలకు చెందిన 102 మంది విద్యార్థులు తమ హాస్టల్లో ఉంటున్నట్లు తెలిపింది. సీసీ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశామని, అవి పని చేయడం లేదని, సాయినాథ్ ఇప్పటి వరకు తాను వచ్చి, వెళ్లే సమయాలను ఎప్పుడు ఎంట్రీ బుక్‌లో రాయలేదని పేర్కొంది. స్నేహితులకు చెప్పే సాయినాథ్ శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడనే విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించింది. మరోవైపు సాయినాథ్ ఆత్మహత్యపై పలువురు విద్యార్థులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులను విచారించనున్నట్లు సమాచారం. -
సాయినాథ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
కుత్బుల్లాపూర్: సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి సాయినాథ్(18) మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. రెండు రోజులుగా కళాశాలకు సెలవులు కావడంతో పోలీసులు సాయినాథ్ వినియోగించిన సెల్‌ఫోన్ కాల్‌డేటాపై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకునే వరకు ఎవరితో మాట్లాడింది.. అసలు సెల్‌ఫోన్ ఎక్కడుందన్న మిస్టరీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి. రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు కొంపల్లిలో ఉన్న రామ్ రితేష్ బాయ్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఆరా తీశారు. డబుల్ బెడ్ రూంలో రఘవీర్, హర్షిత్, రణవీర్, శ్రీధర్, మూర్తి, హర్షిల్లాలతో పాటు సాయినాథ్ ఉంటున్నాడు. అందరితో కలివిడిగా ఉండే అతడు తమకు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులతో వారు వెల్లడించారు. మొత్తం 102 మంది హాస్టల్లో ఉంటున్నారని, అందులో సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని సమాచారం. స్నేహితులకు చెప్పి శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడన్న విషయం తమకు తెలియదని హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు తేలింది. దీనిపై ఇప్పటికే పలువురు విద్యార్థులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లో ఉన్న సీఎంఆర్ కళాశాలలో సీనియర్లను విచారించనున్నారు. మంగళవారం రాత్రి హాస్టల్లో సాయినాథ్ చనిపోయే ముందు రాసిన నోట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలి
► ‘ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్’ అంటూ సూసైడ్ నోట్ ► వరంగల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాయినాథ్ మేడ్చల్/మేడ్చల్ రూరల్/కాజీపేట రూరల్/రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెడుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పెనుభూతం బలి తీసుకుంటూనే ఉంది! రిషితేశ్వరి ఘటన మరవకముందే ర్యాగింగ్ కోరల్లో చిక్కి మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు..’ అని సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కాలేజీలో వండ్లకొండ సాయినాథ్(18) ఇంజనీరింగ్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జూలై 28న కాలేజీలో చేరిన సాయినాథ్.. కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లిలోని రాంరితేష్ అనే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రాఖీ పౌర్ణమి సందర్భంగా బోరబండలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. అక్కడ్నుంచి ఆదివారం హాస్టల్‌కు చేరుకున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని తన సొంతూరు రామక్రిష్ణాపురానికి బయలుదేరి వెళ్లాడు. ఇంటికని వెళ్లిన సాయినాథ్ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు వరంగల్-కాజీపేట్ మధ్య వడ్డేపల్లి చెరువు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో ‘‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు’’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. విచారణ చేపట్టిన పోలీసులు సాయినాథ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న బాలానగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కాలేజీకి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌పై కూపీ లాగుతున్నారు. ఈ కాలేజీ మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డికి చెందినది కావడం గమనార్హం. విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కాలేజీ నిర్మానుష్యంగా కనిపిం చింది. విద్యార్థులు, సిబ్బంది ఎవరూ కని పించలేదు. దీంతో పోలీసులు ఫోన్ల ద్వారా కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు. కాసేపటికి కాలేజీ ప్రిన్సిపల్ జంగారెడ్డి అక్కడికి చేరుకుని తమ కాలేజీలో ర్యాగింగ్ చోటు చేసుకోలేదని చెప్పారు. సాయినాథ్ హాస్టల్‌కు కూడా వెళ్లిన పోలీసులు ఆయన పుస్తకాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలిన ఆశల సౌధం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లెకు చెందిన వడ్లకొండ కనకయ్య, అరుణ దంపతుల చిన్న కుమారుడు సాయినాథ్. వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మట్టి కూలీ పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. కూతురిని ఏంబీఏ చదివించారు. పెద్ద కుమారుడు రఘునందన్ హైదరాబాద్‌లోనే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయినాథ్‌ను కూడా ఇంజనీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ ర్యాగింగ్ రక్కసి వారి కలలను కల్లలు చేసింది. వీరు కొన్నేళ్ల క్రితం మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు వలస వచ్చారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సాయినాథ్ మృతదేహాన్ని వెంకట్రావుపల్లెకు తరలించారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘రెలైక్కిపోయావా కొడుకా... మల్లెప్పుడు వస్తావనుకోవాలె కొడుకా.. ర్యాగింగ్ భూతం నాకు కడుపు కోత విధించిందిరా కొడుకా...’ అంటూ తల్లి అరుణ గుండెలవిసేలా విలపించింది. -
రిజిస్ట్రేషన్ కుంభకోణంపై విచారణ
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చలాన్ల కుంభకోణంపై ఆ శాఖ డీఐజీ వీవీ నాయుడు విచారణకు ఆదేశించారు. నలుగురు అధికారుల్లో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సాయినాథ్, శ్రీధర్‌రాజు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు రవికాంత్, చంద్రశేఖర్‌లను ఇందుకోసం నియమించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, అతని సోదరుడితో కలిసి ఫోర్జరీ, బోగస్ చలాన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడిన విషయం విధితమే. దీనిపై ఈ నెల 13న సాక్షిలో ‘రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం కల్గించింది. మూడు నెలల చలాన్ల పరిశీలనలో రూ.9 లక్షల అక్రమం బయటపడింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుందన్న అనుమానాల నేఫథ్యంలో రూ. కోటికి పైగా స్వాహా చేశారని అనుమానిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నియమాకం నుంచి మొదలుకొని జరిగిన రిజిస్టేషన్ డాక్యూమెంట్లను విచారణ అధికారులు పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా ఎంత ఆదాయం కోల్పోయామో తేటతెల్లం అవుతుందని భావిస్తున్నారు. కాగా నిర్మల్ పోలీసులు ఈ కేసులో విచారణ మొదలుపెట్టారు. నిర్మల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సంబంధిత డాక్యూమెంట్లు అందజేయలని పోలీసులు అడగడంతో బుధవారం వాటిని అధికారులు అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించనున్నారు. తద్వార అసలు సూత్రధారులు ఎవరు అనే కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి 2008 సంవత్సరం నుంచి జిల్లాలోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్నాడు. ఇదివరకు ఆదిలాబాద్, భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేశాడాని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లోనూ పరీశీలన చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
మీ సర్వేతో ఏకీభవించలేం
ఐబీఎన్ సర్వేపై సాయినాధ్, సంజయ్‌బారు అసంతృప్తి వైఎస్సార్సీపీకే విజయావకాశాలున్నాయని స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఆధిక్యం ప్రదర్శిస్తుందన్న సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ సర్వేతో తాను ఏకీభవించలేనని, సీమాంధ్రలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే అత్యధిక స్థానాలు సాధిస్తుందని చర్చలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు, హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాధ్ తెగేసి చెప్పారు. ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారు కూడా సీమాంధ్రలో వైఎస్సార్సీపీకే విజయావకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డారు. సీఎస్డీఎస్-లోక్‌నీతి ఎలక్షన్ ట్రాకర్‌తో కలిసి సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ సీట్లలో టీడీపీ 13-19, వైఎస్సార్సీపీ 9-15, టీఆర్ఎస్ 4-8, కాంగ్రెస్ 4-8 సీట్లు చేజిక్కించుకుంటాయని అంచనా వేశారు. వైఎస్సార్సీపీకే విజయావకాశాలు: సాయినాధ్ సీమాంధ్రలో 39శాతం ఓట్లతో టీడీపీ ముందంజలో ఉంటుందని, వైఎస్సార్సీపీ 33శాతం ఓట్లు సాధిస్తుందన్న సర్వే ఫలితాలతో సాయినాధ్ ఏకీభవించలేదు. ముఖ్యంగా కోస్తాలో టీడీపీ 43శాతం సాధిస్తుందని, వైఎస్సార్సీపీకి కేవలం 23శాతం ఓట్లు వస్తాయని, రాయలసీమలో వైఎస్సార్సీపీకి 41శాతం, టీడీపీకి 31శాతం ఓట్లు వస్తాయని ప్రకటించారు. దీనిపై సాయినాధ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఈ సర్వేతో నేను అంగీకరించలేను. నెల, రెండు నెలల కంటే ఇప్పుడు టీడీపీ పరిస్థితి మెరుగుపడిందనడంపై నేను ఏకీభవించను. గత దశాబ్దంగా సీఎన్ఎన్తోసహా వివిధ సర్వేలు చంద్రబాబు నాయుడు బలాన్ని ఎక్కువగా అంచనా వేశాయి. మళ్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించడంవల్ల సీమాంధ్రలో పూర్తిగా కనుమరుగవుతోంది. ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీ, టీడీపీవైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నారు. దీనివల్ల ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి నెలకొంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. 30, 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నవారు ఒకే పార్టీలో, ఒకే వేదికను పంచుకోవాల్సి వస్తుంది. ఇది అంత సులభంకాదు. నేతలు మారినా కేడర్ మారదు. బీజేపీతో పొత్తు తెలంగాణలో లాభించవచ్చేమోగాని సీమాంధ్రలో టీడీపీకి ఎలాంటి మేలు చేకూరదు. విభజన విషయంలో బీజేపీకూడా తమను మోసం చేసింది సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే విజయం సాధిస్తుందని భావిస్తున్నా’’ అని సాయినాధ్ స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో వైఎస్సార్సీపీకే విజయావకాశాలు ఎక్కువని సంజయ్‌బారు కూడా అభిప్రాయపడ్డారు. నెలరోజుల్లో ఇంతమార్పా? సీఎన్ఎన్-ఐబీఎన్ నెల రోజుల వ్యవధిలోనే విభిన్న సర్వే ఫలితాలను ప్రకటించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ సంస్థ ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 45శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పగా, తాజా సర్వేలో 33 శాతానికే పరిమితం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలరోజుల్లో 12శాతం ఓట్లు చేజారేంత రాజకీయ పరిణామాలు ఏం జరిగాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ర్ట విభజనకు లేఖనిచ్చిన టీడీపీకి 33నుంచి 39శాతానికి ఓట్లెలా పెరిగాయని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఏడుశాతం ఓట్లు రాగా, ఇతరులకు 14శాతం ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మార్చి 18-23 మధ్య నిర్వహించిన ఈ సర్వేకోసం రాష్ట్రంలో కేవలం 1308 మంది అభిప్రాయాలను మాత్రమే సేకరించి ఈ అంచనాకు రావడం గమనార్హం.