శుక్రవారం 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. కేసీఆర్‌కు సంపూర్ణ ఆయువు, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవిత కేక్ కట్ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Warm birthday wishes to Telangana CM Shri K Chandrashekar Rao Garu. May he be blessed with a long life and good health.
— Narendra Modi (@narendramodi) February 17, 2017