సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న పటేళ్లకు గుజరాత్ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పించడం కుట్రలో భాగమేనని బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు రిజర్వేషన్లు అవసరమని రాజ్యాంగం చెబుతున్నా.. పటేళ్లకు రిజర్వేషన్ కల్పించడంపై సుప్రీంకు వెళ్లి పోరాడుతామన్నారు.