
డ్రంకెన్ డ్రైవ్‌లో 146 కేసులు నమోదు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 146 మందిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 కార్లు, 86 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తామని ...అనంతరం వారిని మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే మద్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడిన వారిలో పలువురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.