దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో మంగళవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వహేద్ కాలనీలోని గాజుల ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించి 16 బాల కార్మికులకు విముక్తి కల్పించారు. ఎస్సై గోవింద్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా వహేద్ కాలనీలో బిహార్‌కు చెందిన మహ్మద్ అక్రం (20), ఆస్ఘర్ అజ్హార్ (18), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సద్దాం (25)లు గత కొన్ని నెలలుగా గాజుల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. బిహర్‌కు చెందిన 16 ఏళ్ల లోపు మైనర్ బాలులతో పని చేయిస్తున్నారు.
దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. చిన్నారులతో పని చేయిస్తున్న గాజుల ఫ్యాక్టరీ నిర్వాహకులు మహ్మద్ అక్రం, మహ్మద్ సద్దాం, ఆస్ఘర్ అజ్హార్‌లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విముక్తి కల్పించిన బాలలను శిశువు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దాడుల్లో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఎస్సై నార్ల శ్రీశైలం, రెయిన్‌బజార్ ఎస్సైలు వి.సత్యనారాయణ, గోవింద్ స్వామి, జి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
16 మంది బాల కార్మికులకు విముక్తి
Published Tue, Apr 26 2016 8:02 PM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM
Advertisement
Advertisement