రాష్ట్రంలో 30 వెనుకబడిన జిల్లాలు | 30 backward districts in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 30 వెనుకబడిన జిల్లాలు

Published Sat, Jan 7 2017 3:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

రాష్ట్రంలో 30 వెనుకబడిన జిల్లాలు - Sakshi

రాష్ట్రంలో 30 వెనుకబడిన జిల్లాలు

రూ.900 కోట్ల గ్రాంటు కేటాయించండి
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఇచ్చే వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధిని రెండింతలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించాలని కోరింది. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాలను ఈ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గత రెండేళ్లుగా ఇస్తున్న రూ.450 కోట్ల నిధిని రూ.900 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు రాష్ట్రంలో పది జిల్లాలున్నాయి. అందులో హైదరాబాద్‌ మినహా తొమ్మిది జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కు చేరిందని.. గతంలో ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలో ఏర్పడిన 30 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రతిపాదిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కొత్త రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2015–16లో రాష్ట్రంలోని వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ధి పనులకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేం ద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో రెండో విడత రూ.450 కోట్లు గత నెలలోనే కేటాయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పను లను మరింతగా విస్తరించాల్సిన అవసరమేర్ప డిందని, ఈ నేపథ్యంలో 2017–18లో వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే గ్రాంటును రూ.900 కోట్లకు పెంచాలని కోరింది.

రూ.24,205 కోట్లకు కొర్రీ
రాష్ట్రంలో అమలవుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ చెర్వుల పునరుద్ధరణకు కేం ద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన మేరకు మిషన్‌ కాకతీయకు రూ.5,000 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు కేటాయించాలని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనవని, ఎప్పుడో పూర్తవుతాయో తెలియదంటూ కేంద్ర ఆర్థిక శాఖ నిధులివ్వకుండా కొర్రీ వేసింది. వచ్చే రెండు మూడేళ్ల వ్యవధిలో వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలో వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన మేరకు నిధుల కోటాను కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

స్థానిక సంస్థల కోటా ఏమైంది..
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను విధిగా విడుదల చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాని కి గుర్తు చేసింది. 2015–16లో పదమూడో ఆర్థిక సంఘం నిర్ధేశించిన మేరకు ఈ గ్రాంట్లు విడుదలయ్యాయి. ఆ ఏడాది రావాల్సిన రూ.778.73 కోట్లను కేంద్రం చివర్లో నిలిపేసింది. వాటిని ఆపేయడం సరైంది కాదని, వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement