టీఆర్‌ఎస్ తొలి జాబితాలో వారసుల పేర్లు | 35 candidates names released by TRS on friday | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ తొలి జాబితాలో వారసుల పేర్లు

Published Thu, Jan 14 2016 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

టీఆర్‌ఎస్ తొలి జాబితాలో వారసుల పేర్లు

టీఆర్‌ఎస్ తొలి జాబితాలో వారసుల పేర్లు

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అధికార టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం విడుదల చేయనుంది. తొలి జాబితాలో 35 మంది పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో ప్రముఖ నాయకుల వారసుల పేర్లు ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె విజయలక్ష్మీ, పీజేఆర్ కుమార్తె విజయరెడ్డితో పాటు బొంతు రామ్మోహన్ గేడ్ పేర్లు తొలి జాబితాలో ఫైనల్ అయ్యాయి.


తాజాగా టీ పీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఎ.కృష్ణ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జియాగూడ మాజీ కార్పొరేటర్‌ ఎ.కృష్ణకు టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో టిక్కెట్‌ ఖరారైనట్లు తెలుస్తుంది. గురువారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక కమిటీ క్యాంపు ఆఫీస్‌లో భేటీ అయ్యింది. ఈ భేటీలో తొలి జాబితాను శుక్రవారం, రెండవ జాబితాను శనివారం విడుదల చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆదివారంతో నామినేషన్లకు గడువు ముగిస్తుండడంతో శనివారం నాడు విడుదల చేసే జాబితాతో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement