
వాహనంపై నుంచి జారి పడి మహిళ మృతి
హైదరాబాద్: ప్రమాదవశాత్తూ వాహనంపై నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద మంగళవారం జరిగింది. బడంగ్‌పేటకు చెందిన లక్ష్మి, మరో వ్యక్తితో కలిసి యాక్టీవా వాహనంపై అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళుతోంది. ఆ సమయంలో లక్ష్మి వాహనంపై నుంచి జారి కింద పడిపోవడంతో తలకు పెద్ద గాయం అయింది. 108 వాహన సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.