హైదరాబాద్: డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దని టీఎస్పీఎస్సీ సెక్రటరీ సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చిత్తశుద్ధితో నియామాలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.
కాగా, మోసాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు vigilance@tspsc.gov.in వెబ్సైట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే ఉద్యోగాల విషయంలో అభ్యుర్థులు కూడా అవకతవకలకు పాల్పడితే భవిష్యుత్ పరీక్షలకు అనర్హులు' అని టీఎస్పీఎస్సీ సెక్రటరీ హెచ్చరించారు.
డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాం.. కఠిన చర్యలు!
Published Sat, May 28 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM
Advertisement
Advertisement