TSPSC secretary
-
రేపు ‘2011 గ్రూపు-1’ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూపు-1 మెయిన్స్ రీ ఎగ్జామ్‌ను ఈనెల 14 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్‌లోని 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 14న పేపర్-1, 17న పేపర్-2, 19న పేపర్-3, 21న పేపర్-4, 23న పేపర్-5, 24న జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని వివరించారు. ఈ పరీక్షలకు 8,782 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుంచి 9:15 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. బయోమెట్రిక్ డేటా, ఫొటో, వేలిముద్రలు సేకరిస్తున్నందున 9:15 లోపే పరీక్ష హాల్లోకి వెళ్లాలని తెలిపారు. హాల్‌టికెట్‌తోపాటు వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. సెల్ఫోన్లు, క్యా ల్కులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి తీసుకెళ్తే డీబార్ చేస్తారని హెచ్చరించారు. 2 ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
‘గ్రౌండ్ వాటర్’ పోస్టులకు 17న ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: గ్రౌండ్ వాటర్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు ఈనెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 79 మందిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. -
డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాం.. కఠిన చర్యలు!
హైదరాబాద్: డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దని టీఎస్పీఎస్సీ సెక్రటరీ సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బుకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చిత్తశుద్ధితో నియామాలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. కాగా, మోసాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు vigilance@tspsc.gov.in వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే ఉద్యోగాల విషయంలో అభ్యుర్థులు కూడా అవకతవకలకు పాల్పడితే భవిష్యుత్ పరీక్షలకు అనర్హులు' అని టీఎస్పీఎస్సీ సెక్రటరీ హెచ్చరించారు.