
జూలై 1 నుంచి హెచ్‌సీయూ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో 2015-16 విద్యా సంవత్సర ప్రవేశాలు జూలై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 1 నుంచి 6 వరకు ప్రధాన జాబితా, 7 నుంచి 10 వరకు వెయిట్ లిస్ట్‌లో ఉన్న వారికి ప్రవేశాలు కల్పిస్తారు.
పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ తదితర 108 కోర్సుల్లో 2వేల సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రవేశ ప్రక్రియను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు వర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ విభాగంలో నిర్వహించనున్నారు.