రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తొలి బోణి చేసింది. సరూర్నగర్ మండలం కొత్తపేట -7 స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి ఎంఐఎం తరఫున బరిలో దిగిన షాజిదాబేగం ఎంపీటీసీగా ఎన్నికైయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్ర్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అందులోభాగంగా రంగారెడ్డి జిల్లాలో తొలి ఎంపీటీసీ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది.