
అనసూయ ఆంతర్యం ఏమిటో...
హైదరాబాద్ : ఇప్పటికే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున మేనకోడలిగా 'సోగ్గాడే చిన్న నాయిన' చిత్రంలో బుల్లి తెర తళుక్కుల తార అనసూయ ఛాన్స్ కొట్టేసింది. దాంతో తమ చిత్రంలో అంటే తమ చిత్రంలో నటించమని టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఇప్పడు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. మా చిత్రంలో ప్రత్యేక పాత్ర ఉంది చేస్తారా ? కనీసం ఓ స్పెషల్ సాంగ్లోనైన నటించండి అని సదరు దర్శక నిర్మాతలు ఆమె చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.
బుల్లి తెరను వదిలి వెండి తెర మీదకు రానంటే రానని వారికి నిర్మోహమాటంగా చెప్పేసిందని సమాచారం. పిలిచి వెండి తెరపై ఛాన్స్లు ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ అనసూయ మాత్రం ఇదేమిటిరా బాబూ అని ఆమె ఆంతర్యం అంతుబట్టక టాలీవుడ్ వారంతా జుట్టు పీక్కుంటున్నారంటా. ఈ అమ్మడికి వెండి తెర కంటే బుల్లి తెరె తెగ ఇష్టంగా ఉందని టాలీవుడ్ వారంతా భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రముఖ హీరోహీరోయిన్లతో ఇంటర్వ్యూతోపాటు పలు షోలు చేస్తూ బుల్లి తెరపై అనసూయ హల్చల్ చేస్తోంది. బుల్లి తెరపై ఇలాగే కొనసాగిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుందని వారు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకు అలాంటి ఇలాంటి కాదు గ్రేట్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.