ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఈనెల 27న అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కానుంది.
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఈనెల 27న అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 6న సర్టిఫికెట్ల పరిశీలన, 9 నుంచి 18 వరకు ఆప్షన్ల నమోదు, 22న సీట్ల కేటాయింపు చేస్తారు. జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
మిగిలిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ, 305 ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ విద్యను పటిష్టం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి ప్రమాణాలు పాటించే కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించాలని అడ్మిషన్ల కమిటీ నిర్ణయించింది.