హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ చీఫ్ సెక్రటరీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. చందానగర్లోని రాజేంద్రరెడ్డి పార్క్ స్థలాన్ని కొందరు మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్నారని కసిరెడ్డి బాస్కర్రెడ్డి గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు చీఫ్ సెక్రటరీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. విచారణకు రాకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని భావించిన చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్
Published Wed, Jan 27 2016 2:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM
Advertisement
Advertisement