సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం పరారైన మహేష్ అనే ఆటోడ్రైవర్ శనివారం మారేడుపల్లి శ్మశానవాటికలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం పరారైన మహేష్ అనే ఆటోడ్రైవర్ శనివారం మారేడుపల్లి శ్మశానవాటికలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివిధ నేరాల కింద విచారణ నిమిత్తం గోపాలపురం పోలీసులు మహేష్‌ను నిన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల వేధింపులు భరించలేకే అతడు శ్మశానవాటికలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.