జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం | BASHYAM VICTORY IN JEE ADVANCED RESULTS | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం

Published Mon, Jun 13 2016 2:11 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం - Sakshi

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చెప్పారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తమ విద్యార్థి చుండూరు రాహుల్ ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకుతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీలో కల్లూరి హరిప్రసాద్ అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడని చెప్పారు. జేఈఈ లక్ష్యంగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దుతూ ఏటా సంచలన విజయాలను నమోదు చేస్తున్నామన్నారు.

 

 నారాయణ శ్రీచైతన్య హవా

 హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ సత్తా చాటిందని ఆ విద్యాసంస్థల డెరైక్టర్లు పేర్కొన్నారు. అత్యధిక టాప్ ర్యాంకులతోదేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.  విద్యా సంస్థల డెరైక్టర్లు డాక్టర్ బీయస్ రావు, డాక్టర్ పి.సింధూర  నారాయణ, సుష్మ, శ్రీనిశిత్ విలేకరులతో మాట్లాడుతూ, ఓపెన్ కేటగిరీలో 50 శాతం టాప్ ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి ఫస్ట్ ర్యాంక్‌తో పాటు ఆలిండియా 4, 5, 7, 8, 10.. ఇలా 50 శాతం టాప్ ర్యాంకులు కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో దక్షిణ భారతదేశం నుంచి తొలి ర్యాంకును, ఆలిండియా నాలుగో ర్యాంకులను జీవితేష్ దుగ్గాని, ఆలిండియా ఐదో ర్యాంకును సాయితేజ తాళ్లూరి, ఆలిండియా ఏడో ర్యాంకును జి.నిఖిల్ సామ్రాట్, 8వ ర్యాంకును సాయి ప్రణీత్ రెడ్డి, పదో ర్యాంకును విఘ్నేశ్వర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

 

 శ్రీగాయత్రి విజయభేరి

 హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీ గాయత్రి విద్యార్థులు ఆలిండియా టాప్ ర్యాంకుల సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ పీవీఆర్‌కే మూర్తి తెలిపారు. వివిధ కేటగిరీల్లో 1,000 లోపు 32 ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. శ్రీ గాయత్రి లక్ష్య, ఇంటెన్సివ్ ప్రోగ్రాం, ఐసీసీ ప్రోగ్రామ్ వల్లే తాము ఈ ఘన విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్ రికార్డు

 హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సంచలనం సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ కేకేఆర్ తెలిపారు. తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 4, 13, 16, 25.. వంటి ఆలిండియా టాప్ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థుల నుంచి సాధించినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేఈఈలో విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాభినందనలను తెలియజేశారు.

 

 ‘శశి’ ప్రభంజనం

 హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో మరోమారు సత్తా చాటారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రిన్స్ కమల్ తేజ జాతీయ స్థాయిలో 296 వ ర్యాంకు, టీ సుందర్ 389 వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. హాజరైన 92 మందిలో 51 మంది ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 5 వేల లోపు 19 ర్యాంకులు, 8 వేలలోపు 23 ర్యాంకుల సాధించారన్నారు.

 

 ‘విశ్వభారతి’ పూర్వ విద్యార్థికి 8వ ర్యాంకు

 హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గుడివాడ విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థి సుంకేశుల సాయి ప్రణీత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించాడని స్కూల్ చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ తెలిపారు. మరో పూర్వ విద్యార్థి వి.నిరంజన్ ఆలిండియా 12 వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు.

 ‘ఎస్‌ఆర్’ ప్రతిభ

 హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. జి.రవితేజ జాతీయ స్థాయిలో (రిజర్వేషన్ కేటగిరీ) 16వ ర్యాంకు, భూక్యా రాంనాయక్ 48వ ర్యాంకు సాధించారు. సన్నతి ప్రవీణ్ 50వ ర్యాంకు సాధించాడు. వీరితో పాటు మరో 61 మంది ఐఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారని వరదారెడ్డి వివరించారు. వారిని డైరక్టర్లు మధుకర్, సంతోష్‌రెడ్డి తదితరులు అభినందించారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement