ప్రవేశ పరీక్ష నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన విద్యార్థులకు ఆ తర్వాత ఐఐటీ లేదా ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చి వెళ్లిపోతున్నా.. విద్యార్థులు తమ కాలేజీల్లోనే చేరినట్లు కొన్ని యాజమాన్యాలు చూపిస్తున్నాయి. దాంతో అవి రెండో దశ కౌన్సెలింగ్‌లో ఉండటం లేదు. అర్హులైన విద్యార్థులకు ఆ సీట్లు లభించడం లేదు. అయితే తర్వాత స్పాట్ అడ్మిషన్లలో ఆయా సీట్లను యాజమాన్యాలు అమ్ముకుంటున్నట్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షల, ప్రవేశాల (సెట్స్) కమిటీ గుర్తించింది. అందుకే అలాంటి తప్పిదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
కాలేజీల్లో రిపోర్టింగ్ సమయంతోపాటు (విద్యార్థులు చేరేప్పుడు) సీట్ల రద్దుకు కూడా బయోమెట్రిక్‌ను లింకు చేయాలని నిర్ణయించింది. అలా చేయడం వల్ల సీట్లు బ్లాక్ కాకుండా చూడవచ్చన్న నిర్ణయానికి వచ్చింది. తద్వారా అవి తదుపరి కౌన్సెలింగ్‌కు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాలేజీల్లో చేరేందుకు ఇచ్చిన గడువులోనే విద్యార్థులు రిపోర్టు చేసేలా చర్యలు చేపడుతున్న సెట్స్ కమిటీ.. అప్పుడు కూడా విద్యార్థి బయోమెట్రిక్ వివరాలను సేకరించాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థి కాలేజీలో చేరాడా, లేదా, అన్నది వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ విద్యార్థి కాలేజీలో రిపోర్టు చేయకపోతే సీటు రద్దయి తదుపరి కౌన్సెలింగ్‌లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివ రకు ఈ విధానం లేకపోవడంతో యాజమాన్యాలు ఆ సీట్లు భర్తీ అయ్యాయని చెబుతూ చివరలో అమ్ముకుంటున్నాయి. మరోవైపు బయోమెట్రిక్ డేటానే స్కాలర్‌షిప్ మంజూరు చేసేందుకు కూడా వాడుకోవాలని నిర్ణయించింది.
కాలేజీల అక్రమాలకు బయోమెట్రిక్ చెక్!
Published Thu, Jun 16 2016 3:35 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement