టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే | BJP alternative to TRS, says dr. laxman | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే

Published Mon, Apr 25 2016 3:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP alternative to TRS, says dr. laxman

హైదరాబాద్ : టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యతను బీజేపీనే భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామానికి మోదీ పథకాలను తీసుకు వెళ్తామని తెలిపారు. త్వరలోనే గ్రామాల్లో పర్యటించనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement