ఫ్లెక్సీలో బీజేపీ ఎమ్మెల్యే ఫోటో మిస్సింగ్ | bjp mla rajasingh photo no place in nijam college meeting flexi | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీలో బీజేపీ ఎమ్మెల్యే ఫోటో మిస్సింగ్

Published Tue, Jan 12 2016 6:59 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

ఫ్లెక్సీలో బీజేపీ ఎమ్మెల్యే ఫోటో మిస్సింగ్ - Sakshi

ఫ్లెక్సీలో బీజేపీ ఎమ్మెల్యే ఫోటో మిస్సింగ్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండడంతో... నిజాం కాలేజీ వేదికగా మంగళవారం టీడీపీ, బీజేపీల బహిరంగసభతో ప్రచారాస్త్రంలో అడుగు ముందుకువేశాయి.

ఈ సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బహిరంగ సభ ఫ్లెక్సీలలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోటోకు చోటు కనిపించకపోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఫోటో వేయలేదని తెలుస్తుంది. దీనిపై రాజాసింగ్ ఏవిధంగా స్పందిస్తాడోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement