'బిహార్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉంది' | bjp will sweep bihar elections says venkaiah naidu | Sakshi
Sakshi News home page

'బిహార్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉంది'

Published Sun, Sep 13 2015 3:12 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'బిహార్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉంది' - Sakshi

'బిహార్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉంది'

హైదరాబాద్: బిహార్లో అక్బోబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ..  కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అంగీకరిస్తే పార్లమెంటు శీతాకల సమావేశాలు ముందుకు జరుపుతామన్నారు. జీఎస్టీ బిల్లు స్వరూపం పూర్తిగా మారిందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు గౌరవించాలని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నడిస్తేనే ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి అవుతాయని పేర్కొన్నారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని వెంకయ్యనాయుడు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement