విమానంలో హైదరాబాద్‌ ఉద్యోగినికి వేధింపులు | Briton National Arrested For Misbehaving With Woman On Singapore Flight | Sakshi
Sakshi News home page

విమానంలో హైదరాబాద్‌ ఉద్యోగినికి వేధింపులు

Published Mon, Oct 3 2016 10:57 PM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM

విమానంలో హైదరాబాద్‌ ఉద్యోగినికి వేధింపులు - Sakshi

విమానంలో హైదరాబాద్‌ ఉద్యోగినికి వేధింపులు

హైదరాబాద్‌: మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడో బ్రిటన్‌ దేశస్థుడు. సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన విమానంలో బ్రిటన్‌కు చెందిన అంటోనీ (60) అనే వ్యక్తి గతరాత్రి 11.30 గంటల ప్రాంతంలో 35 ఏళ్ల తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే హైదరాబాద్‌ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్‌ చేసినట్టు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాస్‌ మీడియాకు వెల్లడించారు.

బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ బిజినెస్‌ స్కూల్లో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంటోనీని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరపర్చినట్టు తెలిపారు. దాంతో స్థానిక కోర్టు అతడికి జుడిషియల్ కస్టడీ విధించడంతో రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు అంటోనీ అప్పుడప్పుడూ తన వ్యాపార వ్యవహారాల విషయమై తరచూ హైదరాబాద్‌కు వచ్చిపోతుంటాడనీ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement