సందడిగా నుమాయిష్ | Bustling numayis | Sakshi
Sakshi News home page

సందడిగా నుమాయిష్

Published Fri, Jan 3 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

Bustling numayis

అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఈ 74వ నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 1 బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నుమాయిష్‌లో దాదాపు 50 శాతం స్టాళ్లు ఏర్పాటుకాగా మిగతా స్టాళ్ల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి మరిన్ని స్టాళ్లు ప్రారంభం కానున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి అశ్వినీ మార్గం తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ రంగానికి చెందిన పరిశ్రమల స్టాళ్లు నుమాయిష్‌లో ఆకట్టుకుంటుండడంతో రెండో రోజు సందర్శకుల తాకిడి కనిపించింది.
 
అన్ని రకాల వస్తువులు...

 
నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టాళ్లలో అన్నిరకాల వస్త్రాలు, వస్తువులు, గృహోపకరణాలు, మ హిళాలంకరణ సామగ్రి, ఫ్యాన్సీ డ్రస్ మెటీరియల్, ఫు ట్‌వేర్, డ్రైఫ్రూట్స్, వంట వస్తువులు, పిల్లల ఆట వస్తువు లు, క్రీడా పరికరాలు, మ్యాజిక్ టాయీస్, ఫ్లోర్‌మ్యాట్, కర్టెన్స్, బెడ్‌షీట్స్‌లతోపాటు రకరకాల వస్తువులు నుమాయిష్‌లో కొలువుదీరాయి. అన్ని రకాల వస్తువులు నుమాయిష్‌లో అందుబాటులో ఉండడం ఎంతో సౌలభ్యంగా ఉందని  సందర్శకులు పేర్కొంటున్నారు.
 
చిన్నారుల కేరింతలు...
 
నుమాయిష్‌లో ప్రజలకు వినోదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఎమ్యూజ్‌మెంట్ విభాగం చిన్నారుల కేరింతలతో కోలాహలంగా మారింది. ఎమ్యూజ్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, టోరా టోరా, హెలికాప్టర్, రోలింగ్ కప్‌సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిజ్‌బీ, రేంజర్‌తోపాటు మోటారు బైక్‌లపై యువకుల సాహస విన్యాసాలు, సర్కస్ ఫీట్లు చిన్నారులతోపాటు పెద్దలను అలరిస్తున్నాయి.
 
నోరూరిస్తున్న ఫుడ్‌కోర్టులు...
 
నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టులు రుచికరమై న వంట కాలతో సందర్శకుల నోరూరిస్తున్నాయి. సందర్శకుల అభిరుచి మేరకు ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టు స్టాళ్ల లో చాట్‌బండార్, ఎగ్‌ఫాస్టుఫుడ్, వెజిటేరియన్ ఫాస్ట్‌ఫు డ్ తదితర రుచికరమైన వంటకాలతోపాటు ఫ్రూట్‌జ్యూ స్‌లు, స్వీట్లు, హాట్ చిప్స్, షుగర్ క్యాండీ, ఐస్ క్రీమ్‌లు ఆరగిస్తూ సందర్శకులు రుచులను ఆస్వాదిస్తున్నారు.
 
భారీ బందోబస్తు...
 

ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనున్న నుమాయిష్‌కోసం నిర్వాహకులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులతోపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన 200 మంది సెక్యూరిటీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎగ్జిబిషన్ మైదానం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిఘాను కట్టుదిట్టం చేశారు. మూడు ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రైమ్ మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో సందర్శకులను తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement