హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి సమీపంలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు దగ్ధమయింది. శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని ముగ్గురు అప్రమత్తమై వెంటనే కారు ఆపి బయటకు వచ్చారు. కాసేపటికే కారులో మంటలు పూర్తిగా వ్యాపించటంతో కారు సగం కాలి బూడిదయింది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సంకేతిక సమస్యల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.