నగరంలోని లాలాగూడ పోలీసుస్టేషన్ పరిధిలోగల చంద్రబాబునాయుడునగర్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు హల్ చల్ చేశారు.
హైదరాబాద్: నగరంలోని లాలాగూడ పోలీసుస్టేషన్ పరిధిలోగల చంద్రబాబునాయుడునగర్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు హల్ చల్ చేశారు. అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టవేసే క్రమంలో నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని చంద్రబాబునాయుడు నాయుడు నగర్ లో నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వంర్యంలో దాదాపు వంద మంది పోలీసులు బస్తీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి వ్యక్తి ఆధార్ కార్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేని మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ అనుమానితులు ఎవరైనా తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఏసీపీ, లాలాగూడ సీఐ కరణ్‌కుమార్‌సింగ్‌తో పాటు మరో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 30 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు.